లేటెస్ట్ : రవితేజ సినిమా ఉన్నా పోటీకి సిద్ధం అయ్యిన టాలెంటెడ్ హీరో..!

Godse

Satya Dev’s Godse :  టాలీవుడ్ సినిమా దగ్గర పోటీ అనేది ఎప్పుడూ కూడా చాలా సర్వ సాధారణం. అయితే ఈ పోటీ లో భారీ సినిమాలతో ఇతర చిన్న సినిమాలు కూడా పోటీ పడ్డ సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. అలాగే ఇక పెద్ద స్టార్ సినిమాలు వచ్చాయి అంటే ఇతర చిన్నా చితక హీరోలు సినిమాలు అయితే ఆగాల్సిందే.

కానీ కొందరు మాత్రమే ఆ సాహసం చేస్తున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత ఒకే రోజున గట్టి పోటీ వచ్చేలా కనిపిస్తుంది. లేటెస్ట్ గా ఇపుడు తెలుగు సినిమా వెరీ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ నటించిన ఇంట్రెస్టింగ్ సినిమా “గాడ్సే” రిలీజ్ డేట్ ని మార్చుకుంది.

నిజానికి ఈ మే 20నే ఈ చిత్రం రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఇపుడు పలు కారణాల చేత వచ్చే నెల జూన్ కి దానిని వాయిదా చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ జూన్ 17న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే అసలే ఆ డేట్ కి కరెక్ట్ గా మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ” కూడా ఉంది.

అయితే ఈ సినిమాకి ఆల్రెడీ చాలా మంచి బజ్ మరియు అంచనాలు ఉన్నాయి. సో ఈ సినిమాతో పోటీ అంటే చిన్న మాటేమి కాదు. అయితే సత్యదేవ్ ధైర్యానికి కూడా కారణం లేకపోవచ్చు. ఆ సినిమాని తన గత అండర్ రేటెడ్ హిట్ “బ్లఫ్ మాస్టర్” దర్శకుడు గోపితో చేసాడు అంటే కంటెంట్ పరంగా ఇది కూడా ఎక్కడా తగ్గకుండా ఉంటుంది. ఆ నమ్మకమే పోటీకి కారణం కావచ్చు. మరి ఇందులో ఏ సినిమా మంచి విజయం సాధిస్తుందో చూడాలి.

Godse
Godse