Mahesh Babu:” సర్కారు వారి పాట”కు తిప్పలు తప్పడం లేదా.. అందుకే ఇలా జరుగుతోందా?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కి టాలీవుడ్ లో ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకులను అలరించి మహేష్ బాబు కరోనా కారణంగా 2021 సంవత్సరంలో ఆయన ప్రేక్షకుల ముందుకు రాలేకపోయారు. ప్రస్తుతం ఆయన నటించిన సర్కారి వారి పాట సినిమా ఈ సంవత్సరమైనా రిలీజ్ అవుతుందో లేదో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా ఇన్ టైంలో షూటింగ్ కంప్లీట్ చేయలేక పోయామని మేకర్ చెప్పుకొచ్చారు.

గీత గోవిందం సినిమా డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో ఈ సర్కారు వారి పాట చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మేజర్ పార్ట్ 60 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయింది,మిగిలిన 40 పర్సెంట్ షూటింగ్ వేగవంతంగా పూర్తి చేసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నపటికీ ఏవో ఒక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. మొదట ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయటానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా సంక్రాంతి బరిలో ఉండటం వల్ల ఈ సినిమాను ఏప్రిల్ 1 కి వాయిదా వేసుకున్నారు. షూటింగ్ కి తరచుగా ఆటంకాలు కలగటం వల్ల ఈ సినిమా ఏప్రిల్ 1 న కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదేమో అన్న సందేహాలు వెలువడుతున్నాయి .

తాజాగా మహేష్ బాబు కాళ్ళకి సర్జరీ జరిగి ఆయన కోలుకున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్నారు,కానీ ఇటీవల మహేష్ బాబుకి కరోనా సోకింది. ఇవన్నీ చాలవన్నట్టు సడన్గా మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి చెందారు. దాంతో ఈ సినిమా ఇప్పటిలో రిలీజ్ అవ్వదు అన్న సందేహాలు అందరిలో మొదలయ్యాయి. అందువల్ల ఈ సినిమా ఆగస్టుకు పోస్ట్ ఫోన్ చేయాలని బృందం అనుకుంటున్నట్టు సమాచారం. అయినా ఇప్పటి వరకు ఈ విషయం గురించి అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ చేయలేదు.