Sarkaru Vaari Paata : లీకైనా ఆల్ టైం రికార్డ్స్ తో షురూ చేసిన “సర్కారు వారి పాట”.!

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. వరుస విజయ చిత్రాల దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ స్థాయి అంచనాలే నెలకొన్నాయి.

ప్రతి అంశంలో కూడా హైలైట్ గా నిలిచిన ఈ చిత్రం నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సాంగ్ నిన్ననే రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. అయితే ఈ సాంగ్ ఆల్రెడీ లీక్ అయ్యిన సంగతి తెలిసిందే. దీనితో మహేష్ ఫ్యాన్స్ మాత్రం చాలా కసి తెచ్చుకున్నారు.

దీనితో ఈ సాంగ్ ని టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా దగ్గరే ఆల్ టైం రికార్డ్స్ కలిగిన దానిలా నిలపాలని టార్గెట్ పెట్టుకున్నారు. మరి అది ఇప్పుడు నిజం చేసి చూపించారని చెప్పాలి. ఇంకా ఈ సాంగ్ వచ్చి 24 గంటలు అవ్వకుండానే ఏకంగా 12 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి ఆల్ టైం రికార్డుని సెట్ చేసింది.

అంతే కాకుండా యూట్యూబ్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతుంది. మొత్తానికి అయితే థమన్ తపన అంతా సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సహా 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిపి మహేష్ బాబు తన నిర్మాణ సంస్థతో కలిపి నిర్మాణం వహిస్తున్నారు.