మహేష్ షూటింగ్లో కలకలం.. అంతా ప్యాకప్

Sarkaaru Vaari Paata shooting stopped due to corona
Sarkaaru Vaari Paata shooting stopped due to corona
 
రోజురోజుకీ ఇండస్ట్రీలో కోవిడ్ కలకలం ఎక్కువవుతోంది. స్టార్లతో సహా యూనిట్ సిబ్బంది కూడ వైరస్ బారిన పడుతున్నారు.  తరచూ కేసులు వస్తూనే ఉన్నాయి.  పవన్, బండ్ల గణేష్, అనిల్ రావిపూడి ఇలా పలువురికి వైరస్ సోకింది.  దీంతో చిత్రీకరణలు నిలిచిపోతున్నాయి.  ఇప్పటికే చిన్న, పెద్ద సినిమాలు చాలా వాటికి బ్రేకులు పడగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ షూటింగ్ సైతం నిలిచిపోయినట్టు తెలుస్తోంది.  ఇందుకు కూడ కరోనానే కారణమని తెలుస్తోంది.  
 
నిజానికి షూటింగ్ ఈపాటికే ఆగాల్సి ఉన్నా మేకర్స్ మాత్రం వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని అనుకున్నారు.  కానీ ఈలోపే టీమ్ వైరస్ బారిన పడ్డారు.  క్రూలో ఇప్పటికే 5 మందికే పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.  దీంతో హడావుడిగా షూటింగ్ ఆపేశారట.  ఇప్పుడు మొత్తం టీమ్ అందరికీ కరోనా పరీక్షలు చేసి అందరికీ నెగెటివ్ వస్తేనే షూటింగ్ రీస్టార్ట్ చేస్తారట.  మరి ఇప్పుడు అందరికీ పరీక్షలు, రిజల్ట్స్ అంటే చాలా సమయమే పడుతుంది.  ఒకవేళ కొత్తగా కేసులు తేలితే మాత్రం కొన్నాళ్ళు షూటింగ్ ఆపివేయక తప్పేలా కనబడట్లేదు.