సందీప్ వంగ డైరెక్షన్లో మహేష్ బాబు.. కానీ ఒక్కరోజే

sandeep-vanga-to-direct-mahesh-babu

sandeep-vanga-to-direct-mahesh-babu

అర్జున్ రెడ్డి’ సినిమాతో సందీప్ రెడ్డి వంగ సూపర్ పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆయనతో సినిమాలు చేయడానికి చాలామంది యువ హీరోలు ఆసక్తి చూపించారు. కానీ సందీప్ మాత్రం మహేష్ బాబు మీదే ఆశలు పెట్టుకున్నారు. మహేష్ పిలవడం, కథ గురించి చర్చించడం జరిగింది. కానీ చివరికి ఏదీ ఫైనల్ కాలేదు. ఇదిగో అదిగో అన్నారు కానీ మహేష్ బాబు సందీప్ వంగకు అవకాశం ఇవ్వలేదు. సందీప్ సైతం మహేష్ బాబును ఒప్పించాడనికి చాలానే కష్టపడ్డారు. కథలో మార్పులు చేర్పులు చాలానే చేశారు. అయినా నో యూజ్. దీంతో సందీప్ బాలీవుడ్ మీద దృష్టిపెట్టారు.

‘కబీర్ సింగ్’ చేసి హిట్ కొట్టి రన్బీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఆయనకు మహేష్ బాబును డైరెక్ట్ చేసే అవకాశం దొరికింది. అయితే అది సినిమా రూపంలో కాదులెండి. ఒక యాడ్ కోసం. సదరు ప్రోడక్ట్ యాజమాన్యం యాడ్ షూట్ డైరెక్ట్ చేయడం కోసం సందీప్ రెడ్డి వంగను ఎంచుకుంది. మహేష్ సైతం అందుకు ఓకే చెప్పారు. కేవలం ఒకే ఒక్క రోజు ఈ యాడ్ షూట్ జరగనుంది. మహేష్ బాబును డైరెక్ట్ చేయాలనే సందీప్ వంగ కోరిక ఇలా నెరవేరింది. మరి ఈ కొలాబరేషన్లో సందీప్ స్టైల్ ఆఫ్ మేకింగ్ మహేష్ బాబుకు అర్థమై, ఒకవేళ నచ్చితే ఛాన్స్ ఇచ్చినా ఇవ్వొచ్చు.