Home News పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న సంపూర్ణేష్‌.. ఊపిరి పీల్చుకున్న చిత్ర బృందం

పెద్ద ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న సంపూర్ణేష్‌.. ఊపిరి పీల్చుకున్న చిత్ర బృందం

ఒక‌ప్పుడు డూపుల‌తో స్టంట్స్ చేసే మ‌న హీరోలు ఇప్పుడు ఎవ‌రి సాయం అవ‌సరం లేద‌న్న‌ట్టు యాక్ష‌న్ సీన్స్‌లోకి బ‌రిలోకి దిగుతున్నారు. ఇటీవ‌ల అజిత్ ఓ యాక్ష‌న్ సీన్ లో భాగంగా పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇప్పుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా సినిమా చిత్రీక‌ర‌ణ‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డాడు. పెద్ద ప్ర‌మాదం నుండి తృటిలో తప్పించుకోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Sampoo | Telugu Rajyam

సంపూ హీరోగా నాగేశ్వ‌ర‌రావు తెర‌కెక్కిస్తున్న చిత్రం బ‌జార్ రౌడీ. సంది రెడ్డి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ శివారు ప్రాంతంలో జ‌రుగుతుంది. యాక్ష‌న్ సీన్‌లో భాగంగా సంపూర్ణేష్ త‌న బైక్‌ను సంచుల మ‌ధ్య నుండి కింద‌కు దింపాలి. ఆ సీన్‌లో సంపూర్ణేష్ స‌రిగ్గా దించ‌క‌పోవ‌డంతో బైక్ అదుపు త‌ప్పి సంపూర్ణేష్ కింద ప‌డిపోయాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన చిత్ర సిబ్బంది ఆయ‌న‌ను ర‌క్షించారు. సంపూర్ణేష్‌కు పెద్ద ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో యూనిట్ స‌భ్యులతో పాటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

హృద‌య కాలేయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బ‌ర్నింగ్ స్టార్‌గా అభిమానుల మ‌న‌సులు గెలుచుకున్నాడు. ఈ సినిమా త‌ర్వాత సింగం 123, కొబ్బరిమట్ట, కరెంట్‌ తీగ, బందిపోటు, జ్యోతిలక్ష్మి తదితర సినిమాల్లో నటించాడు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజ‌న్‌లోను పాల్గొన్నాడు. కొద్ది రోజుల‌కే ఆయ‌న ఇంటి నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. సంపూర్ణేష్ న‌టుడిగానే కాదు మంచి మాన‌వ‌తా వాదిగా అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు త‌న వంతు సాయం చేస్తూ అంద‌రిచే ప్ర‌శంస‌లు పొందుతుంటారు సంపూ. 

- Advertisement -

Related Posts

స్వలింగ వివాహం .. కేంద్రం ఏం చెప్పిందంటే ?

ఒకే జెండర్‌ వారి మధ్య జరిగే వివాహాలను ప్రత్యేక వివాహ చట్టం కింద గుర్తిస్తూ.. చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఢిల్లీ హై కోర్టులో దాఖలైన పిటిషన్‌ని కేంద్రం వ్యతిరేకించింది. అతి పెద్ద శాసన...

టీడీపీ పుర‌పాలక ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల !

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పుర‌పాలక ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోన్న నేప‌థ్యంలో టీడీపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ...

ఆ కీలక నేతకు పిలిచి పదవి… ‘బాలయ్య’కి జగన్ ఊహించని షాక్ !

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేత , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఊహించని షాక్ ఇచ్చాడు. హిందూపురం లో బాలయ్యకి ఝలక్ ఇచ్చిన మహ్మద్ ఇక్బాల్ కి సీఎం...

మ‌రోసారి వార్త‌ల‌లోకి న‌య‌న‌తార పెళ్ళి.. మార్చిలో వివాహం అంటూ ప్ర‌చారం

ద‌క్షిణాది స్టార్ హీరోయిన్స్‌లో న‌య‌న‌తార రూటే స‌ప‌రేట్‌. ఇద్ద‌రితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ప‌డిన ఈ ముద్దుగుమ్మ చివ‌ర‌కు ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో సెటిల్ అయింది. 2015లో విఘ్నేశ్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘నానుం...

Latest News