హీరోగా ఐదు సినిమాలు చేస్తున్న సంపూర్ణేష్ బాబు

Sampoornesh Babu doing five movies as hero
Sampoornesh Babu doing five movies as hero
హీరో సంపూర్ణేష్ బాబు పేరు చెబితేనే నవ్వులు పూస్తాయి.  పేరడీలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు.  మొదటి సినిమా ‘హృదయ కాలేయం’తో హీరో అంటే ఇలా కూడ ఉండవచ్చు అని చూపించి మెల్లగా ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ఒక సినిమాతోనే కెరీర్ ముగిసిపోతుంది అనే విమర్శలను తిప్పికొడుతూ ఇంకో రెండు సినిమాలు చేసి మెప్పించాడు.  ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తున్నాడు సంపూర్ణేష్ బాబు.  ఆయన హీరోగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నాడు.  చిన్న నిర్మాతలు చాలామంది సంపూర్ణేష్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
 
ప్రజెంట్ ‘బజార్ రౌడీ, క్యాలీ ఫ్లవర్, గోల్డ్ మ్యాన్’ అంటూ ఐదు సినిమాలు చేస్తున్నాడు సంపూర్ణేష్ బాబు.  పేరుకు చిన్న హీరోనే అయినా మీడియం రేంజ్ హీరోలతో సమానంగా చేతి నిండా సినిమాలతో దూసుకుపోతున్నాడు సంపూర్ణేష్ బాబు.  అంతేకాదు బిజినెస్ పరంగా కూడ సంపూర్ణేష్ భేష్ అనే అనాలి. ఎందుకంటే తక్కువ ధరలకు లభించే ఆయన చిత్రాలను కొనుగోలుచేయడానికి డిస్ట్రిబ్యూటర్లు చాలా ఆసక్తి చూపుతున్నారు.  సినిమాల్లోనే కాదు సేవా కార్యక్రమాల్లో కూడ సంపూ అందరికంటే ఒక అడుగు ముందే ఉంటున్నాడు.  ఎవరికైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తూ తన శక్తిమేర సహాయ సహకారాలు అందిస్తున్నాడు.