ఫేక్ రూమర్స్‌పై సమంత స్ట్రాంగ్ రిప్లయ్.!

పిల్లల్ని కనే విషయమై సమంత ఓ నాగచైతన్య మధ్య వివాదమట, అందుకే విడాకులట. కెరీర్ పరంగా సమంత విషయంలో నాగచైతన్య అభ్యంతరాలు చెప్పాడట, చైతన్యతో సమంత విభేదించిందట. ఇలాంటి రూమర్స్ చాలానే వినిపిస్తున్నాయి సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారానికి సంబంధించి.

అయితే, జరుగుతున్న దుష్ప్రచారంపై సమంత స్పందించింది. విడాకులనేది ఓ పెద్ద గాయమనీ, ఆ గాయం నుంచి కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని సమంత చెప్పుకొచ్చింది. ప్రచారంలో వున్న ఫేక్ గాసిప్స్‌ పట్ల సమంత తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

‘అదంతా దుష్ప్రచారం మాత్రమే. ఖచ్చితంగా ఈ ఇబ్బందికర పరిస్థితి నుంచి బయటపడతాను. ఈ గాసిప్స్ ఏవీ నా ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయవు..’ అంటూ సమంత సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

సమంత అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్. ఆ విషయం ఇప్పుడు ఇంకోసారి నిరూపితమయ్యింది. సమంత – నాగచైతన్య ఇటీవల తాము విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. అప్పటి నుంచీ సమంతపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు.