Samantha : ఈ స్టార్ దర్శకునితో సామ్ భారీ ప్రాజెక్ట్? దీనిపై క్లారిటీ మీకోసం.!

Samantha :  తన సెకండ్ ఇన్నింగ్స్ లో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంతా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. ఒక్కో దాన్ని మించిన సినిమాతో సమంతా అదిరే ఆఫర్స్ ను అందుకొని దూసుకెళ్తుంది. అయితే ఈ లిస్ట్ లో కొన్ని వెబ్ సిరీస్ లు, ఐటెం నంబర్స్ అలాగే హాలీవుడ్ ఆఫర్స్ సైతం ఉన్నాయి.

అయితే ఇదిలా ఉండగా ఇండస్ట్రీ వర్గాల్లో సమంతా క్రేజీ లైనప్ పై ఒక ఊహించని గాసిప్ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు సమంతా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది చాలా తక్కువే మరి ఈ బ్యాక్ డ్రాప్ లోనే సమంతా ఓ భారీ సినిమాని టాలీవుడ్ లో ఒక స్టార్ దర్శకునితో చేయబోతున్నట్టు టాక్ వైరల్ అవుతుంది.

అలాగే ఆ దర్శకుడు మరెవరో కూడా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అట. మరి ఈ క్రేజీ కాంబో లోనే సాలిడ్ సినిమా రాబోతుంది అని ఇందులో సారాంశం. అయితే దీనిపై కొన్ని ట్రస్టడ్ మీడియా వర్గాలు వారు క్లారిటీ ఇస్తున్నారు. అసలు ఈ టాక్ లో ఎలాంటి నిజం లేదట.

సామ్ అలాగే త్రివిక్రమ్ లు ఎవరికి వారు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు తప్పితే ఇద్దరూ కలిపి ఒక సినిమా అయితే చెయ్యడం లేదట. ఇదే ఈ కాంబో పై బయటకొచ్చిన ఫైనల్ క్లారిటీ..