Samantha: సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగారు. ఈమె అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత తన స్టార్ డం మరింత పెరిగిపోయింది. ఇలా నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సమంత పెద్ద ఎత్తున సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఇటీవల కాలంలో సమంతకు పెద్దగా అవకాశాలు లేవని చెప్పాలి విడాకుల తర్వాత సమంత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉన్నారు. నాగచైతన్య నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన సమంత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు అయితే ఈ బాధ నుంచి బయటపడుతూ ఈమె యశోద, శాకుంతలం , ఖుషీ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకాదరణ అందుకోలేకపోయాయి. దీంతో ఈమె వెబ్ సిరీస్ లపై ఆసక్తి చూపించారు ఇటీవల సమంత ప్రధాన పాత్రలో నటించిన సిటాడేల్ వెబ్ సిరీస్ ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ ఇది కూడా పెద్దగా ఆదరణ అందుకోలేకపోయింది ఇక ప్రస్తుతం సమంత పెద్దగా సినిమాలను కూడా చేయలేదు ఇక నిర్మాణ సంస్థను ప్రారంభించిన శుభం అనే సినిమా చేసిన ఈమె పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేసాయి.
ప్రస్తుతం సమంత రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ లో నటిస్తున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల ఈ సిరీస్ కూడా షూటింగ్ ఆగిపోయిందని తెలుస్తుంది కేవలం పాతిక రోజులు షూటింగ్ కోసమే సగం డబ్బులు ఖర్చు చేశారని ఇలా డబ్బులలో పెద్ద ఎత్తున స్కాం జరిగిందనే విషయం బయటపడటంతో మిగిలిన డబ్బుతో ఈ సిరీస్ పూర్తి చేయలేమని నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ షూటింగ్ కూడా ఆపేసిన దీంతో సమంతకు ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేవనే చెప్పాలి. దీంతో ఈమె ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంది సమంత తిరిగి సిరీస్ లు కాకుండా సినిమాలపై ఫోకస్ పెడితే ఎప్పటిలాగే తన స్టార్డం ఉంటుందని అభిమానులు కూడా వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.