అయ్యోపాపం సమంత.. ‘వేగం’గా ‘ఆ పని’ జరగట్లేదెందుకు.?

నాగచైతన్యతో విడాకుల విషయమై అసత్య ప్రచారాలు చేస్తూ, తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించారంటూ మూడు యూ ట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు వారం గడుస్తున్నా ఈ కేసు విషయమై ఎలాంటి క్లారిటీ రాలేదింతవరకూ.

హైద్రాబాద్‌లోని కూకట్ పల్లి కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. మొదట పరువు నష్టం దావా వరకూ ఎందుకు బహిరంగ క్షమాపణ అడిగితే సరిపోతుందని సమంతకు చురకలంటించిన కోర్టు, తదుపరి విచారణ నిమిత్తం వాయిదాల మీద వాయిదాలూ వేస్తే వస్తోంది.

సమంత తరపు న్యాయ వాది తనదైన శైలిలో వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. లేటెస్టుగా తన క్లయింట్ సమంత పరువుకు నష్టం వాటిల్లేలా ఉన్న వీడియోలను సదరు యూ ట్యూబ్ ఛానెళ్లు తొలగించాలనీ, భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు.

ఈ సారి కూడా తీర్పును రిజర్వ్ చేస్తూ, మరోసారి రేపటికి వాయిదా వేసింది న్యాయ స్థానం. చూడాలి మరి, ఈ సారైనా ఈ కేసులో సమంతకు కోర్టు నుండి ఫైనల్ తీర్పు వస్తుందో.? లేదో.?