సమంత ఇప్పటికీ నాగచైతన్యను మర్చిపోలేక పోతుందా… అందుకు నిదర్శనమే ఆ పుస్తకమా?

సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోయి సుమారు పది నెలలు దాటిన ఇప్పటికీ వీరి విడాకుల విషయం గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంది. సమంత నాగచైతన్యకు సంబంధించి ఏ చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది.ఇలా నాగచైతన్య సమంత విడాకుల విషయం గురించి నిత్యం ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఇకపోతే తాజాగా సమంత ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. ఇలా ఒక్కసారిగా సమంత ముంబై ఎయిర్ పోర్టులో కనిపించేసరికి కెమెరాలన్నీ తనపై ఫోకస్ చేశాయి.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేసిన సమంత చేతిలో యు కెన్ హీల్ యువర్ లైఫ్ అనే బుక్ తో కనిపించారు. మానసికంగా కృంగిపోయిన వారు డిప్రెషన్ లో ఉన్నవారు ఈ పుస్తకం చదివితే మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. ఈ క్రమంలోనే సమంత ఈ పుస్తకం చదవడంతో ఈమె ఇంకా చైతన్య విడాకుల డిప్రెషన్ లోనే ఉందని ఇప్పటికి తను చైతన్య జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతుందని భావిస్తున్నారు.

అయితే సమంత విడాకుల సమయంలో ఎంతో కృంగిపోయానని ఆ సమయంలో జీవితమే చాలా కష్టంగా మారిపోయింది అంటూ తాజాగా ఒక టాక్ షోలో విడాకుల సమయంలో తానుపడిన బాధను బయటపెట్టారు.అయితే ప్రస్తుతం ఈమె ఈ బుక్ తో ఎయిర్ పోర్టులో సందడి చేయగా తాను నిజంగానే చైతన్య జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతుందని తెలుస్తోంది. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈమె శాకుంతలం, ఖుషి, యశోద వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.