Samantha : సమంత స్పెషల్ సాంగ్.. వాళ్ళకి ఎక్కడో కాలేలా చేస్తోందే.!

Samantha : ‘పుష్ప’ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ చేయబోతోందన్న ఊహాగానాల దగ్గర్నుంచి ఆమె మీద సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ షురూ అయ్యింది. అప్పటినుంచీ ఇప్పటిదాకా అది కొనసాగుతూనే వుంది. ఆ స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో కూడా రానే వచ్చేసింది. సినిమా థియేటర్లలో విడుదలయ్యేందుకూ సిద్ధమయ్యింది.

ఇక, ‘లిరికల్ వీడియో’ రావడంతోనే, సో కాల్డ్ హేటర్స్ తమ బుద్ధిహీనతను మరోమారు గట్టిగా చాటేసుకోవడం మొదలు పెట్టేశారు. అక్కినేని నాగచైతన్య – సమంతల వైవాహిక బంధం మొన్నీమధ్యనే విడాకులతో తెగిపోయింది. ‘ఎవరి దారులు వారివి..’ అని ఇద్దరూ కలిసి విడివిడిగా ఓ ప్రకటన చేసేసిన విషయం విదితమే.

అయినాగానీ, సోకాల్డ్ హేటర్స్ మాత్రం ఆగడంలేదు. తగ్గేదే లే.. అంటూ సమంత మీద విరుచుకుపడుతున్నారు. ‘సిగ్గులేదా స్పెషల్ సాంగ్ చేయడానికి.?’ అంటూ మండిపడుతున్నారు హేటర్స్. బాలీవుడ్ హాటీ మలైకా అరోరా ఖాన్, పిల్లల తల్లి అయ్యాక కూడా స్పెషల్ సాంగ్స్ చేసింది. సినిమా వేరు, జీవితం వేరు.

నటన అనేది ఓ ప్రొఫెషన్.. నటీమణులకు పెళ్ళయితే సినిమాల్లో అవకాశాలు రావన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పెళ్ళయ్యాక అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. విడాకుల వ్యవహారం తర్వాత మరింతగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి.

అమలా పాల్ లాంటోళ్ళే ఇందుకు నిదర్శనం. వైవాహిక బంధం వర్కవుట్ కానంతమాత్రాన, సమంత తన ప్రొఫెషనల్ లైఫ్ కోల్పోవాలా.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే. ఆ సంగతి పక్కన పెడితే, సమంత ‘పుష్ప’ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్ మాత్రం, ఖచ్చితంగా ‘స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అయి తీరుతుంది.