Samantha Fear With Sea : సముద్రం అంటే ఇష్టపడని వారుంటారా.? చిన్నా, పెద్దా.. ఆ మాటకొస్తే ముసలీ ముతకా కూడా సముద్రం ఒడ్డుకెళితే, తెలియని సాంత్వన పొందుతారు. ఎక్కడ లేని మానసిక ఉల్లాసాన్ని ఫీలవుతారు. సముద్ర నీటిలో స్నానం చేయడం వల్ల రకరకాల స్కిన్ డిసీజెస్ నుండి ఉపశమనం పొందొచ్చని వైద్య నిపుణులు చెబుతున్న మాట.
అందుకేనేమో అందాల భామలు కూసింత టైమ్ దొరికినా సముద్రాలంపట… అదేనండీ బీచ్‌ల్లో విరగబడి దొర్లేస్తుంటారు. సముద్రపు అందాల్నిఆ అందగత్తెలు ఎంజాయ్ చేస్తుంటే, ఎంజాయ్‌మెంట్ పేరు చెప్పి వాళ్లు చేసే స్కిన్ షో చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తుంటారు. కదా..
మరి, ముద్దుగుమ్మ సమంతకి సముద్రం అంటే ఎందుకంత భయమంట.? సమంతకు ఒక రకమైన స్కిన్ ప్రాబ్లమ్ వుంది. ఉప్పు నీరు తగిలితే, సమంత స్కిన్ దారుణంగా డ్యామేజ్ అయిపోతుంది. ఈ స్కిన్ ప్రాబ్లమ్ కారణంగానే తన కెరీర్‌లో ఓ బిగ్ ప్రాజెక్టును సమంత వదిలేసుకోవాల్సి వచ్చిందంటే, నమ్ముతారా.? నమ్మాల్సిందే.
గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ‘కడలి’ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించాల్సి వుంది. తన స్కిన్ ప్రాబ్లమ్ వల్లనే ఆ ప్రాజెక్టు వదిలేసింది. సమంత ప్లేస్‌లో సీనియర్ నటి రాధ చిన్న కూతురు తులసి ఆ సినిమాలో నటించింది. అఫ్‌కోర్స్ ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదనుకోండి. సో, సమంతకి పెద్దగా ఒరిగిందేమీ లేదనుకోవాలి.