Samantha Sexy Item Song : ‘సెక్సీ’ ఐటమ్ సాంగ్స్, ‘ఉఊ’ అనేసిన సమంత.! ఎందుకంటే.!

Samantha Sexy Item Song : సెక్సీగా కనిపించడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది..’ అంటూ ఇటీవల సమంత సోషల్ మీడియాలో ‘పుష్ప’ సినిమాలోని ఐటమ్ సాంగ్ విషయమై పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయిన విషయం విదితమే. హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ చేయడం కొత్తేమీ కాదు. సమంత కూడా ఆ కోవలోనే స్పైసీ స్పెషల్ సాంగ్ చేసింది.

తమన్నాకి ఇలాంటి ఐటమ్ సాంగ్స్ బాగానే అలవాటైపోయాయ్.. కాజల్ కూడా ఓ సారి స్పెషల్ సాంగ్ చేసేసింది.. అది కూడా ‘జనతా గ్యారేజ్’ సినిమాలో. శృతిహాసన్ సంగతి సరే సరి. ఐటమ్ సాంగ్.. స్పెషల్ సాంగ్.. పేరేదైతేనేం, ఈ ప్రత్యేక గీతాలకు వున్న క్రేజ్ వేరు.

అనసూయ తదితరులు స్పెషల్ సాంగ్స్ అనగానే, స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడానికి కారణం, ‘భారీ రెమ్యనరేషన్’ అంటారు చాలామంది. సమంత విషయంలోనూ అది బాగానే వర్కవుట్ అయ్యింది. దాంతో, రెండు మూడు ఆఫర్లు సమంత ముందుకు వచ్చిపడ్డాయి. ఇలాంటప్పుడే కాస్త బెట్టు చేస్తే, స్పెషల్ సాంగ్ రెమ్యునరేషన్ మరింత పెరుగుతుంది.

తాజాగా, సమంత ముందుకు ఓ స్పెషల్ సాంగ్ ఆఫర్ వస్తే, షాకిచ్చేలా రెమ్యునరేషన్ చెప్పి, అట్నుంచి తటపటాయింపులు ఎదురయ్యేసరికి ‘నో’ అనేసిందట. ఆ తర్వాతే ‘సెక్సీగా కనిపించడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది..’ అంటూ సోషల్ మీడియాలో సమంత పోస్ట్ పెట్టిందని అంటున్నారు.

అయితే, ఆ ఆఫర్ చేజారిపోలేదట.. సమంత కోరినంత రెమ్యునరేషన్‌కి ఓకే అయ్యిందనీ, వచ్చే నెలలో ఆ సాంగ్ షూట్ వుంటుందనీ, ఓ ప్రముఖ హీరో నటిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమా అదనీ సమాచారం.