పాన్ ఇండియా హీరోయిన్ సమంత లేటెస్ట్ గా పలు భారీ సినిమాలు ఆమె ఓరియెంటెడ్ గా అంతే కాకుండా హీరోయిన్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే మరోపక్క పలు వెబ్ సిరీస్ లు కూడా సమంత చేస్తుండగా ఇక ఈ వారం అయితే భారీ పాన్ ఇండియా సినిమా “శాకుంతలం” తో అయితే బిజీగా ఉంది.
మరి ఈ సినిమా ఎన్నో సార్లు రిలీస్ వాయిదా పడగా ఈ సినిమా షూటింగ్ సమయంలో పలు ప్రమోషన్స్ సమయంలో కూడా ఆమె చాలా ఇబ్బందిగా కనిపించేది. అయితే దీని కారణం ఆమె మాయో సైటిస్ తో బాధ పడుతూ ఉండడం కాగా దీని నుంచి ఆమె బయట పడింది కానీ మళ్ళీ తాజాగా అయితే తాను అనారోగ్యం పాలైనట్టు చెప్తుంది.
సమంత సడెన్ గా శాకుంతలం ప్రమోషన్స్ ఆపేయడం ఆసక్తిగా మారింది. అయితే దీనికి గల అసలు కారణాన్ని అయితే సమంత తాజాగా బయటపెట్టింది. తాను అనుకున్నట్టుగా అన్ని ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి ఉంది అని కానీ నాకు సడెన్ గా గొంతు పోయింది అని అలాగే జ్వరం కూడా వచ్చేయడంతో అన్నీ ఆపేసానని సమంత చెప్పుకొచ్చింది.
అయితే సినిమా అందరు కూడా ఈరోజు జరిగే ఈవెంట్ లో పాల్గొనాలి అని నేను దానిని మిస్ అవుతున్నానని తాను చెప్పింది. కాగా ఈ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో ఈ ఏప్రిల్ 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
(2/2)Please join team #Shaakuntalam at the Annual Day Event of MLRIT this evening… will miss you ♥️
— Samantha (@Samanthaprabhu2) April 12, 2023