Samantha: రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సమంత పోస్ట్… టైం చూసి దెబ్బ కొట్టిందిగా?

Samantha: సమంత పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కొనసాగుతున్న ఈమె ఇటీవల కాలంలో ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి కొండా సురేఖ సమంత గురించి కేటీఆర్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కేటీఆర్ కారణంగానే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలపై తీవ్రదుమారం రేగింది. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఈ విషయంపై స్పందిస్తూ మంత్రి కొండా సురేఖను తప్పుపట్టారు. అయితే తాజాగా తెలంగాణ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం పై సమంత కూడా గట్టిగా తన వాదనను వినిపిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని పూర్తిగా చదును చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా 400 ఎకరాల భూమిని చదును చేయడం అంటే ఎన్నో వన్యప్రాణులకు ఆవాసం పోతుంది. పెద్ద పెద్ద వృక్షాలు ఒక్కసారిగా నేలమట్టం అయితే ఉష్ణోగ్రత కూడా పెరిగి పర్యావరణం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

ఈ క్రమంలోనే ఈ 400 ఎకరాలను చదును చేయకూడదు అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. అయితే ఈ ధర్నాకు మద్దతుగా సినీ సెలెబ్రిటీలు కూడా నిలుస్తున్నారు .తాజాగా సమంత సైతం ఈ ఘటనపై స్పందిస్తూ..ఓవైపు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా కానీ అడవి ప్రాంతంలో నలబై బుల్డోజర్స్ తో చెట్లను తొలగిస్తున్నారని సమంత పోస్ట్ చేసింది. అడవులను నిర్లక్ష్యం చేస్తే ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు ఎన్నో వన్యప్రాణులకు ఆవాసంగా ఉండే ఈ అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది.