Samantha: సినీ నటి సమంత ఫిట్నెస్ పై ఎంతో శ్రద్ధ చూపిస్తారని సంగతి మనకు తెలిసిందే తాజాగా ఈమె తన ఫిట్నెస్ లో భాగంగా 90 సెకండ్ల పాటు డెడ్ హ్యాంగ్ చాలెంజ్ లో పాల్గొని విజయవంతంగా ఈ చాలెంజ్ పూర్తి చేశారు.ఆమె తన శారీరక బలాన్ని ప్రదర్శించి 90 సెకన్ల పాటు బార్‌కు వేలాడుతున్న ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. తన అభిమానులకు స్ఫూర్తినివ్వడమే లక్ష్యంతో ఈ ఛాలెంజ్ స్వీకరించినట్లు తెలిపారు.
ఇలా 90 సెకండ్ల పాటు చేతులు ఒక బార్ ను పట్టుకొని కాళ్లు పూర్తిగా వేలాడదీస్తూ నిలబడటం అంటే మామూలు విషయం కాదు ఇలా 90 సెకండ్ల పాటు సమంత ఎంతో సునాయసంగా వేలాడటంతో ఈమె శారీరక బలం ఏంటో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం సమంత ఈ చాలెంజ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్ అంటే సరిగ్గా అదే అనిపిస్తుంది “మీ చేతులు పూర్తిగా చాచి, పాదాలను 90 సెకన్ల పాటు వేలాడదీసి పుల్-అప్ బార్ (లేదా ఇలాంటి దృఢమైన ఓవర్‌హెడ్ బార్) నుండి వేలాడదీయడానికి ప్రయత్నించాను. అందులో సక్సెస్ కూడా అయ్యానని చెప్పుకొచ్చింది.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లపై ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇక చివరిగా సమంత ఖుషీ సినిమాలో నటించి సందడి చేశారు. ఈ సినిమా తర్వాత ఈమె పూర్తిస్థాయిలో హీరోయిన్గా ఏ సినిమాలోని నటించలేదు అయితే త్వరలోనే నందిని రెడ్డితో కలిసి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఏ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతుందని సమాచారం. అయితే ఈ సినిమా సమంత నిర్మాణ సంస్థలోనే తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
