Home News చైతూ కోస‌మే జిమ్‌కు వెళ్లిన స‌మంత‌.. అక్క‌డ ఏం జ‌రిగిందో తెలుసా?

చైతూ కోస‌మే జిమ్‌కు వెళ్లిన స‌మంత‌.. అక్క‌డ ఏం జ‌రిగిందో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య ఎప్పుడు ప్రేక్ష‌కుల దృష్టిని అల‌రిస్తూనే ఉంటారు. ఏ మాయ చేశావే స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య చిగురించిన స్నేహం ప్రేమ‌గా మారి ఆ త‌ర్వాత పెళ్లి వ‌ర‌కు వెళ్ళింది. చైతూ- స‌మంత వివాహం జరిగి మూడేళ్ళు పైనే అవుతుంది. అయితే త‌న లైఫ్‌లో జరిగిన ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఒక్కొక్క‌టిగా రివీల్ చేస్తూ వ‌స్తున్న స‌మంత గ‌తంలో జ‌రిగిన కొన్ని విష‌యాల‌ను వివరించింది.

Sam Chai | Telugu Rajyam

స‌మంత ప్ర‌స్తుతం త‌మిళ సినిమాతో పాటు సామ్ జామ్, ది ఫ్యామిలీ మెన్ 2, శాకుంత‌లం అనే ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. అయితే త‌మిళ సినిమా షూటింగ్ కోసం సొంత రాష్ట్రానికి వెళ్లిన స‌మంత అక్క‌డ మ‌నుషులు, కుటుంబ స‌భ్యులు, స్నేహితులని చూడ‌గానే చాలా ఎమోష‌న‌ల్ అయింది. త‌న అనుభ‌వాలు కూడా వివ‌రించాల‌ని అనుకుంది. అందులో భాగంగా త‌న ప్రేమ గురించి కూడా ఓపెన్ అయింది. చైత‌న్య ఎక్కువ స‌మ‌యం జిమ్‌లోనే ఉంటాడు. అక్క‌డే ఎక్కువ స‌మ‌యం గ‌డిపేస్తుంటాడు. అదేని అత‌ని ఫిట్‌నెస్ ఫ్రీక్ అని యాంక‌ర్ అడిగింది.

యాంక‌ర్ ప్ర‌శ్న‌కు త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చింది స‌మంత‌. జిమ్ గురించి మాట్లాడుతున్న స‌మయంలో ఓ ర‌హ‌స్యాన్ని రివీల్ చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది సామ్. పెళ్ళికి ముందు చైతూ కోస‌మే జిమ్‌కు వెళ్లేదాన్ని . అక్క‌డ అతనితో ముచ్చ‌ట్లు పెడుతూ, మ‌రింత స్నేహం పెంచుకున్నాను. మా స్నేహం పెరిగి ప్రేమ‌గా మారి ఇప్పుడు ఒక్క‌ట‌య్యేలా చేసింది అని బ‌దులిచ్చింది. అక్కినేని కోడ‌లిగా మారేందుకు స‌మంత వేసిన స్కెచ్ మాములుగా లేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక చైతూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు, పెద్ద‌గా బ‌య‌ట‌కి రాడు ఎందుకు అని ప్ర‌శ్నవేయ‌గా, దానికి బ‌దులిచ్చిన స‌మంత అది అందరం కలిసి చైనే అడుగుదాం అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఈ ముద్దుగుమ్మ న‌టించిన ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ఫిబ్ర‌వరి 12 ప్రేక్ష‌కుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే. 

- Advertisement -

Related Posts

గంటా వర్సెస్ విజయసాయిరెడ్డి: ఎవరు రైట్.? ఎవరు రాంగ్.?

'గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు..' అని వైసీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించడంతో, ఆ వెంటనే గంటా శ్రీనివాసరావు స్పందిస్తూ,...

షర్మిలపై చంద్రబాబు ఘాటు కామెంట్స్.. అవసరమా.?

  నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం తన సొంతమని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మహిళల విషయంలో అదుపు తప్పి రాజకీయ కోణంలో వ్యాఖ్యలు చేస్తే ఎలా.? వైఎస్ జగన్...

జనసేనను కలిపేసుకుంటున్న టీడీపీ: లబోదిబోమంటున్న జనసైనికులు

2019లో అనుసరించిన వ్యూహాన్నే మునిసిపల్ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అమలు చేస్తోంది. అధికార పార్టీని ఎదుర్కోవాల్సింది పోయి, జనసేన పార్టీ మీద తన ప్రతాపం చూపిస్తోంది టీడీపీ. 2019 ఎన్నికల సమయంలో 'జనసేన...

Latest News