Samantha: టాలీవుడ్ మోస్ట్ క్యూటెస్ట్ కపుల్ అని పేరు తెచ్చుకున్న సమంత – నాగచైతన్య తమ నాలుగేళ్ల వివాహబంధానికి శుభం కార్డ్ పెట్టిన విషయం అందరికి తెలిసిందే. ఈ సంఘటన జరిగి నెలలు గడుస్తున్నా సమంత నాగచైతన్య విడాకుల టాపిక్ మాత్రం హాట్ టాపిక్ గా మారి సోషల్ మీడియాలో నేటికి చర్చకు దారితీస్తోంది.
ఈ విషయం పైన ప్రతీరోజు ఏదో ఒక సందర్భంలో నెటిజన్లు, డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వార్తలు వస్తూనే ఉన్నాయి. సాధారణంగా వివాహబంధం బలహీనమైనదని అందరికీ తెలుసిందే. ఇతర బంధాలతో పోలిస్తే దీనికి ఎమోషన్స్ అండ్ బాండింగ్ ఎక్కువ. అందుకే కాంప్రమైజ్ అయి కొందరు రిలేషన్‌లోనే కొనసాగుతుంటారు. మరికొందరు మాత్రం చట్టప్రకారం విడిపోతుంటారు.
సమంత, చైతన్యల మధ్య వ్యక్తిగతంగా ఏం జరిగిందో వాళ్ళిద్దరికీ తప్ప మరెవ్వరికీ తెలీదు. అందుకే తమ పెళ్లి బంధానికి ముగింపు చెప్పి ఎవరి జీవితాల్లో వారు బిజీగా మారిపోయారు. కానీ, సమంత, చైతన్య విడాకుల గురించి ప్రతీరోజు ఏదో ఒక వార్త హైలెట్ అవుతోంది. ఏడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత చైతన్య జంట ఏవో మనస్పర్దల కారణంగా తమ నాలుగేళ్ల వివాహబంధానికి గుడ్ బై చెప్పారు. కానీ సామ్ మాత్రం తనకు తగిలిన గాయాన్ని తలుచుకుంటూ రోజు బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చైతన్య మాత్రం తన గురించి ఏ విషయం బయటకు రానివ్వడం లేదు. సామ్ మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక పోస్టులు పెడుతోంది.
అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్‌లో భాగంగా కొన్ని క్వచ్ఛన్స్ ని అడిగారు యాంకర్స్. అలా రామ్ చరణ్‌కి సమంత గురించి ఒక ప్రశ్న ఎదురైంది. సమంత గురించి ఒక్క ముక్కలో ఏం చెబుతారని యాంకర్ ప్రశ్నించగా, చరణ్ అదిరిపోయే సమాధానమిచ్చాడు. ఇంతకి రామ్‌చరణ్ ఏం చెప్పారంటే సమంత `కమ్ బ్యాక్, బిగ్గర్, స్ట్రాంగర్` అని సమాధానం తెలిపారు. చాలా పెద్దగా, బలంగా ఆమె తిరిగి వచ్చిందని పేర్కొన్నారు. రామ్‌చరణ్ సమాధానంతో ఎన్టీఆర్, రాజమౌళి సైతం అభినందనలతో కూడిన నవ్వులు పూయించారు.
అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది కాస్త సమంత వరకు వెళ్లింది. దీంతో ఆమె ఆ వీడియోని తన ట్విట్టర్ ఖాతా నుండి రీట్వీట్ చేసింది. సమంత చరణ్‌కి ప్రేమతో కూడిన లవ్ ఎమోజీలను పంచుకుంది. ప్రస్తుతం సమంత ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లని తెగ ఆకట్టుకుంటుంది.
♥️♥️♥️ https://t.co/IqHN3aQ8Jw
— Samantha (@Samanthaprabhu2) December 27, 2021