Samantha : మన టాలీవుడ్ లోనే కాకుండా టోటల్ సౌత్ ఇండియన్ సినిమా దగ్గర స్టార్ హీరోయిన్ సమంతా క్రేజ్ వేరు. తన మొదటి సినిమాతోనే సమంతా అక్కినేని వారి హీరో నాగ చైతన్య తో ప్రేమలో పది దాదాపు ఏడేళ్లు తర్వాత అతడిని పరిణయమాడింది.
తర్వాత మళ్ళీ వారి వివాహ బంధం ఎంతో సాఫీగా నాగ్ కుటుంబంతో సాగుతుంది గత ఏడాదిలోనే బిగ్ బాస్ షో కి అక్కినేని కోడలిగా నాగ్ ప్లేస్ లో హోస్టింగ్ కి వచ్చి అలరించింది అనుకుంటే ఆ తర్వాత ఏడాది కాలం గడవకుండానే చైతు నుంచి విడాకులుతో ఒక్కసారిగా అందరి హృదయాలను ముక్కలు చేసింది.
అయితే ఇద్దరు కూడా ఇష్టపడే వేరు అయినా నింద మాత్రం సమంతానే ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా తర్వాత ఊహించని విధంగా తన కెరీర్ లో భారీ సినిమాలు చేస్తూ ప్రతి ఒకరినీ స్టన్ చేసింది. అయితే చైతుతో విడాకులు తీసుకున్నాక మొదటి సారిగా ఆ తర్వాత తన పరిస్థితిపై నోరు విప్పింది.
నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తాను చైతూ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఒకానొక స్టేజ్ లో చచ్చిపోతానేమో అనిపించేది అని అంత బాధగా ఉండేది అని అలాగే కొన్ని సందర్భాల్లో చాలా లో గా అనిపించినపుడు కానీ తనలో తాను అంతర్మధనం పడుతూ బలంగా నిలిచి నెట్టుకొచ్చానని.
ఇంకా తన మనో స్థైర్యానికి థాంక్స్ చెప్పుకుంది. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా చాలా సపోర్ట్ వచ్చింది అని అందుకే మళ్ళీ కెరీర్ ని స్టడీ గా తీసుకెళ్లగలుగుతున్నాని జాతీయ స్థాయి మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తెలిపింది.