టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత మొదట్లో సిద్ధర్థ్ తోటి ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత కొన్నాళ్ళకు నాగ చైతన్య ని పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ళ పెళ్లి ఎక్కువ రోజులు నిలవలేదు. పెళ్ళైన నాలుగు సంవత్సరాలకు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సినిమాలతో బిజీ గా ఉన్నారు.
వీళ్ళ విడాకులకు కారణం తెలియకపోయినా….సమంత తన స్టైలిస్ట్ తో అతి చనువుగా ఉండడం, ఫామిలీ మాన్ వెబ్ సిరీస్ లో వొద్దన్నా నటించడం, అలాగే ఓవర్ గా ఎక్సపోసింగ్ చెయ్యడం వల్లే విడాకులకు దారి తీసిందని ఒక వార్త ఉంది.
తాజా సమాచారం ప్రకారం, వాళ్ళ అమ్మ ఒత్తిడి మీద సమంత రెండో పెళ్ళికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. మరో పక్క నాగ చైతన్య శోభిత ధూళిపాళ తో లవ్ లో ఉన్నట్టు ఒక న్యూస్ కూడా వైరల్ అయ్యింది. అయితే వీటి పైన సమంత కానీ, నాగ చైతన్య గాని ఇంకా స్పందించలేదు.