బాలీవుడ్ స్టార్ హీరో సరసన స్పెషల్ సాంగ్ చేయనున్న సమంత…?

స్టార్ హీరోయిన్ సమంత గురించి తెలియని వారంటూ ఉండరు. సమంత తెలుగులో నటించిన మొదటి సినిమా “ఏ మాయ చేశావే” ద్వారా హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ,హింది భాషలలో సినిమాలు చేస్తు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. మొన్నటివరకు హీరోయిన్ గా వైవిధ్యమైన పాత్రలలో నటించి అందరినీ ఆకట్టుకున్న సమంత ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో ఉ అంటావా మామ ఉ ఊ అంటావా మామ అంటూ తన గ్లామర్ తో ఒక ఊపు ఊపింది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం సమంత గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత మరొకసారి స్పెషల్ సాంగ్ లో నటించనుందని సమాచారం. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌ వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా బాలీవుడ్‌లో యానిమల్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. ఇదిలా ఉండగా సందీప్ ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ను డిజైన్ చేస్తున్నాడు. ఈ సినిమాకీ హైలైట్ గా నిలిచే ఈ స్పెషల్ సాంగ్ లో మొదట పూజా హెగ్డే నటించనుందని వార్తలు వినిపించాయి.

కానీ తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో పూజా హెగ్డే బదులు సమంత నటించనుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన సమంత ఆ సినిమా ద్వార దేశమంతా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో యానిమల్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ కోసం ఈ సినిమా యూనిట్ సమంతను సంప్రదించినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించటానికి సామ్‌ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.