ఇండస్ట్రీ టాక్ : “పుష్ప” సాంగ్ లో రెచ్చిపోనున్న సమంతా.!

రీసెంట్ గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ సినిమా “పుష్ప పార్ట్ 1” లో స్టార్ హీరోయిన్ సమంతా కూడా పార్ట్ అయ్యినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో ఐదవ పాట ఐటెం సాంగ్ కి గాను సమంతా ని ఎంపిక చేసినట్టుగా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా సాంగ్ పై ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ సమాచారం వినిపిస్తుంది.

ఆల్రెడీ ఈ సాంగ్ కి సమంతా రికార్డు అమౌంట్ ఛార్జ్ చేస్తుండగా ఆ అమౌంట్ కి తగ్గ న్యాయం సాంగ్ లో చూపిస్తుందట. ఈ సాంగ్ కోసం సామ్ చాలా గ్లామ్ ని చూపించనుందట. గతంలో ఎపుడో సూర్య సినిమాకి ఆ రేంజ్ లో హాట్ షో తో సమంతా రెచ్చిపోయింది. ఇక ఇప్పుడు పుష్ప రాజ్ కోసం మళ్ళీ ఆ పని చేయనుందట. మరి ఈ సాంగ్ లో సమంత ఎలాంటి గ్లామర్ ని చూపిస్తుందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.