Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే. తరచూ ఏదోక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది సమంత. మొన్నటి వరకు మయోసైటీస్ వ్యాధితో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి నెమ్మదిగా కోరుకుంటూ సినిమాలలో మళ్లీ బిజీ బిజీ అవ్వాలని చూస్తోంది. ఇకపోతే సమంత చివరిగా శుభం సినిమాలో ఒక అతిధి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు హీరోయిన్ గా ఖుషి సినిమాలో నటించింది.
అలాగే సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ లో నటించింది. కాగా శుభం మూవీ తర్వాత సమంత సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఆ మూవీతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన సమంత ప్రస్తుతం సినిమాలేవీ చేయడం లేదు. సోషల్ మీడియాలో ఇటీవల ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. జిమ్ లో వర్కవుట్స్ చేస్తూ తెగ బిజీ అయిపోయింది. ముంబైలో జిమ్ బయట ఆమె కనిపించడంతో కొందరు ఫోటోలు తీసేందుకు ఎగబడ్డారు. దీంతో సమంత కాస్తా అసహనానికి గురైంది.
కహా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో జిమ్ వర్కవుట్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేసింది. అందులో వీడియోతో పాటు ఒక కోటేషన్ కూడా రాసుకొచ్చింది. తన బాడీ గురించి కామెంట్స్ వారిని ఉద్దేశించి అందులో ప్రస్తావించింది. వీటిలో మొదటి మూడు చేయగలిగితే తప్ప నన్ను సన్నగా, అనారోగ్యంగా ఉన్నారని అలా చెత్తగా మీరు పిలవలేరు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అయితే ఇది తన బాడీని షేమింగ్ చేస్తున్న వారిని ఉద్దేశించే చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాను జిమ్ లో కష్టపడుతున్న వీడియోలను కూడా పంచుకుంది. సమంత తన వర్కౌట్ వీడియోతో ట్రోలర్స్ కు సవాలు విసురుతోంది. అంతే కాకుండా తన గురించి ట్రోల్స్ చేసే వారికి గట్టిగానే ఆ వీడియోతో బుద్ధి చెప్పింది. ఇకపోతే సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రఖ్త్ బ్రహ్మండ్ సినిమాతో పాటు బంగారం అనే తెలుగు చిత్రంలో కనిపించనుంది.