త్వరలోనే మీ సంగతి చూస్తా..స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సమంత.. పోస్ట్ వైరల్..?

టాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో కెరీర్ పరంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే మామూలుగా సమంత ఏదైనా పట్టు పట్టింది అంటే వదలదు అన్న విషయం తెలిసిందే. ఆ పని ఎంత కష్టమైనా సరే ఆ పనిని పూర్తి చేసేవరకూ వదలదు. అయితే అది సినిమా విషయంలో నైనా, పర్సనల్ విషయంలోనైనా,లేక జిమ్ విషయంలోనైనా ఎంతో పట్టుదలగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. సమంత కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫిట్నెస్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుంది.

ఫిట్ నెస్ కోసం తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆ మధ్య ఒక సారి జిమ్ లో సమంత వంద కేజీల బరువును ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో సమంత వర్కవుట్లను కాస్త తగ్గించినట్లు తెలుస్తోంది. అయితే అలవాటు తప్పడంతో బరువులు ఎత్తడంలో కాస్త వెనక్కి వెళ్లిన సమంత ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. వంద కేజీల బరువు ఎత్తేందుకు రెడీ అవుతోంది. సమంత గత కొన్ని రోజులుగా కాశ్మీర్‌లో ఉందన్న సంగతి తెలిసిందే. ఖుషీ సినిమా కోసం విజయ్ దేవరకొండతో కలిసి సమంత రొమాన్స్ చేయబోతోన్న సంగతి తెలిసింది.

అయితే ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ షూటింగ్ కోసం ఏనాడూ తన వర్కవుట్లను పక్కన పెట్టేయలేదు. తన వర్కవుట్లకు అంతరాయం రానీయకుండా చేసేసింది. అయితే ఈ వంద కేజీల బరువును ఎత్తడంలో అతిదగ్గర్లో ఉన్నట్టు చెప్పుకొచ్చింది సమంత. వంద కేజీలు.. త్వరలోనే నీ సంగతి చూస్తా.. ఇప్పుడు తొంభై కేజీలు ఎత్తేశా.. ఇంకా పది కేజీల దూరంలోనే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక అది కూడా రేపో మాపో ఎత్తేసేలా ఉంది. ఇందుకు సంబంధించి పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.