ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ సినిమా దగ్గర కూడా స్టార్ హీరోయిన్ సమంతా కి ఉన్న స్టార్డం కోసం అందరికీ తెలిసిందే. కానీ రీసెంట్ గానే సమంతా తన వైవాహిక జీవితం నుంచి బ్రేక్ తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక అక్కడ నుంచి సామ్ ఎలా ఉంటుందా అని అంతా అనుకున్నారు కానీ వారి అనుమానాలకి అతీతంగా సమంతా తన లైఫ్ ని మరింత సాఫీగా కొనసాగిస్తూ ఆశ్చర్య పరిచింది. అయితే రీసెంట్ గా సమంతా ఓ గే కపుల్ కి కంగ్రాట్స్ చెప్పడం ఆసక్తిగా మారింది.
తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కడ నుంచో కాదు మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఇద్దరి గే కపుల్ పెళ్లి చేసుకున్న ఘటన చోటు చేసుకోవడంతో వారిని టాగ్ చేసి సామ్ కంగ్రాట్స్ చెప్పింది. దీనిని బట్టి సమంత దృష్టిలో మనుషుల రిలేషన్స్ కి ఎలాంటి గౌరవం ఇస్తుందో మనం అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ పోస్ట్ అయితే వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయితే సమంతా పలు భారీ ఓటిటి సిరీస్ లు సినిమాలతో బిజీగా ఉంది.