Samantha : నేను మల్టీ టాలెంటెడ్ అంటోంది సమంత. అవును నిజమే, స్టార్ హీరోయిన్‌గా పలు రకాల పాత్రల్లో ( ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ కోసం నెగిటివ్ షేడ్ కూడా) నటించి మెప్పించిన సమంతను మల్టీ టాలెంటెడ్ అని ఒప్పుకోవచ్చు. కానీ, ఇక్కడ విషయం అది కాదండోయ్.
సమంత నుంచి ఏ ట్వీట్ వచ్చినా అదో వైరల్ న్యూసే. అలా నెటిజన్లకు బోలెడంత కంటెంట్ ఇస్తూ వుంటుంది సమంత. తాజాగా సమంత ఇచ్చిన కంటెంట్ తెలిస్తే షాకవ్వాల్సిందే. సమంత హెయిర్ స్టైలిస్ట్‌గా మారిపోయింది. తనకేం అవసరం. చిటికేస్తే వందల మంది స్టైలిస్టులు క్యూలో నిలబడతారు కదా సమంత కోసం అనుకుంటున్నారా.?
అందుకే, సమంత తన కోసం హెయిర్ స్టైలిస్ట్ కాలేదు. తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ అనే ఓ ప్రబుద్ధుడున్నాడు కదా.. అదేనండీ, ఈయనగారి కారణంగానే పాపం సమంత, నాగచైతన్య విడిపోయారన్న ప్రచారం వుంది.. ఇలా చెబితే బాగా అర్ధమవుతుంది.
హా.! ఆ ప్రీతమ్ గారి కోసమే సమంత హెయిర్ స్టైలిస్ట్ అవతారమెత్తిందట. ఆయనగారి నెత్తి మీద జుట్టంతా కట్ చేసి, ఇదిగో నేనూ హెయిర్ స్టైలిస్ట్‌నే. నాలో ఇన్నిరకాల టాలెంట్స్ వున్నాయ్ చూశావా.? నీకింత చక్కగా హెయిర్ స్టైల్ చేసినందుకు నాకు డబ్బులివ్వాల్సిందే.. అంటూ ఓ అర్ధం పర్ధం లేని ట్వీట్ ఒకటి నెట్టింట్లో షేర్ చేసిందట. అదే ఇప్పుడు వైరల్ అయిపోతోంది మరి. అదీ సమంత హెయిర్ స్టైలింగ్ స్టోరీ. పోలా.! అదిరిపోలా.!