Samantha: టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగ చైతన్య సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజం చేస్తూ విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక వారి విడిపోయి రెండు నెలలు పూర్తి అయినా కూడా వారికి సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే వారు విడాకుల విషయం ప్రకటించిన సమయంలో, వారి అభిమానులు షాక్ కి అవ్వడమే కాకుండా వారి విడాకుల విషయం నిజం అవ్వకూడదు అంటూ సోషల్ మీడియా లో పోస్ట్లు పెట్టడమే కాకుండా దేవుళ్ళను కూడా ప్రార్థించారు. ఇక వారు విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత కూడా వారు కలిస్తే బాగుండు అని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు.
గతంలో కూడా ఇలాగే కొంత మంది సెలబ్రిటీలు విడిపోయి మళ్లీ కలిసి సహజీవనం కొనసాగిస్తున్నారు. అలా సమంత,నాగచైతన్య కూడా కలవకపోతారా అని అభిమానులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే సమంత, నాగ చైతన్య రెండు రకాల కారణాలు వాళ్ళు మళ్లీ కలుస్తారు అన్న నమ్మకం కలిగిస్తున్నాయి. మొదటిది ఇటీవల నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ లో బెస్ట్ ఫెయిర్ ఎవరు అన్న ప్రశ్నకు సమంత అంటూ సమాధానం ఇచ్చాడు. ఆ ప్రశ్నకు సమంత పై చైతన్య కి ఎంత ప్రేమ ఉందో తెలిపాడు అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక రెండవది తాజాగా సమంత నాగచైతన్య తో బ్రేకప్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ ఒక పోస్ట్ చేసింది.
ఆ పోస్ట్ ని తాజాగా డిలీట్ చేసింది. ఆ పోస్ట్ డిలీట్ చేయడంతో సమంత తన నిర్ణయాన్ని మార్చుకుంది.. సమంత కూడా నాగ చైతన్య పై ప్రేమ ఉంది.. కాబట్టి వీరిద్దరి త్వరలోనే ఈ రెండు కారణాల వల్ల కలుస్తారు అంటూ అభిమానులు వార్తలను ప్రచారం చేయడం మొదలు పెట్టారు. వీరిద్దరూ కలిసి మళ్ళీ వైవాహిక జీవితాన్ని గడపడం తో పాటు సినిమాలు చేయాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఈ విషయాలపై సమంత, నాగచైతన్య ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.