సమంత కొడుకు బర్త్ డే.. స్పెషల్ సర్ ప్రైజ్ ఇవ్వనున్న సామ్!!

Samantha About Her Pet Hash Birthday

సమంత జంతు ప్రేమికురాలన్న సంగతి తెలిసిందే. సమంతకు ప్రస్తుతం ఓ కొడుకు కూడా ఉన్నాడు. వాడి పేరు హష్. కొడుకు అంటే కంగారు పడకండి.. అది మనిషి కాదు. సమంత పెట్ పేరు హష్. దాన్ని తన కొడుకుగా భావిస్తుంది సమంత. ఆ మధ్య దానికి ఒంట్లో బాగా లేకపోవడంతో ఎంతో ఆందోళన చెందింది. స్కిన్ ఎలర్జీ వస్తే నివారణ చర్యలు సలహాలు సూచనలు ఇవ్వండని సమంత వేడుకుంది.

Samantha About Her Pet Hash Birthday
Samantha About Her Pet Hash Birthday

అలా నెటిజన్లు ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించి తన హష్ రోగాలను నయం చేసింది. తాజాగా నేడు హష్ బర్త్ డే రెండేళ్లు నిండాయి అని సమంత హ్యాపీగా ఓ పోస్ట్ చేసింది. మై బేబీ బాయ్ అంటూ హష్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా హష్ బర్త్ డే సందర్బంగా సాకీ నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ రాబోతోందని తెలిపింది. సామ్ చేసిన పోస్ట్‌ను చూస్తుంటే హష్ లాంటి పెట్స్‌కు సరిపోయే కొత్త డిజైనర్ దుస్తులను లాంచ్ చేసేలా కనిపిస్తోంది.

హష్ వర్సెస్ సాకీ అంటూ సమంత ఓ పోస్ట్ చేసింది. సాకీ వరల్డ్ నేను కలిసి హష్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ఈ కలెక్షన్స్ నాకు ఎంతో ముఖ్యమైనవి.. వీటికి నా హృదయంలో ప్రత్యేకస్థానం ఉంటుంది. వాడి బర్త్ డే సందర్భంగా వీటిని తెస్తున్నాం.. అయితే అవి పరిమిత సంఖ్యలోనే ఉంటాయి.. తొందరగా ప్రీ ఆర్డర్ చేసుకోండని సమంత చెప్పుకొచ్చింది. ఈ ఆఫర్ నవంబర్ 29 వరకే ఉంటుందని తెలిపింది.