చై – సామ్: మధ్యలో ఓ సూపర్ స్టార్.!

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య వైవాహిక జీవితంలో నిప్పులు పోయడమా.? వినడానికే ఒకింత రోతగా అనిపిస్తోంది కదూ.? బాలీవుడ్ నటి కంగనా రనౌత్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ వల్లనే నాగచైతన్య – సమంత విడిపోయారని ఆరోపిస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

సమంత – నాగచైతన్య.. విడిపోవడానికి పెద్ద కారణాలుండొచ్చు, చిన్నకారణాలుండొచ్చు.. అవి వారి వ్యక్తిగతం. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటిస్తోన్న ఓ సినిమాలో ఆయనతో కలిసి నటిస్తున్నాడు నాగచైతన్య. అంతకు మించి అమీర్ ఖాన్, నాగచైతన్య వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే అవకాశమే వుండదు.

అమీర్ ఖాన్ ఇటీవల తన భార్య కిరణ్ రావుతో విడిపోయారు గనుక, అదే రీతిలో నాగచైతన్య – సమంతని విడదీశాడనడం ఎంతవరకు సబబు.? ఏమోగానీ, తెలుగు మీడియాలో కూడా అమీర్ ఖాన్ వ్యవహారంపై పెద్ద రచ్చే జరుగుతోంది. ఇంకోపక్క సామ్ – చైతూ విడాకుల మంటల్లో చలికాచుకుంటున్నాడు మరో నటుడు సిద్దార్ధ.

‘మహాసముద్రం’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సిద్దార్ధ తాజాగా వేసిన ట్వీటు కాస్తా సామ్ – చైతూ విడాకుల గురించేననే చర్చ జరుగుతోంది. ‘మోసం చేసినోళ్ళెప్పుడూ బాగుపడినట్టు చరిత్రలో లేదు..’ అన్నది సిద్దార్ధ ఉవాచ. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఆ ట్వీటేశాడోగానీ, సామ్ – చైతన్య గురించే ఈ ట్వీట్ అని అనుకుంటున్నారందరూ.

ఇంతేనా, ఇంకా చాలా పెద్ద కథ వుంది. సామ్ – చైతన్య మధ్య విడాకుల కోసం 200 కోట్ల మేర సామ్ లబ్ది పొందిందనీ, మరో 100 కోట్లను సామ్ డిమాండ్ చేస్తోందనీ అంటున్నారు. ఇవన్నీ నిజమేనా.? ఇంతకు ముందూ చాలా సినీ విడాకులు చూశాం. ఆ సమయంలోనూ రాద్ధాంతం ఇలాగే జరుగుతూ వచ్చింది. అయితే సామ్ – చైతన్యల విడాకుల వివాదం.. ఇంకెన్నాళ్ళు మీడియాలో చర్చనీయాంశమవుతుందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.