SSMB 29: ఎస్ఎస్ఎంబి 29 లో నటించాలంటే భయంగా ఉంది…. సలార్ నటుడు సంచలన వ్యాఖ్యలు!

SSMB 29: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను కూడా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి ఎలాంటి విషయాలను కూడా బయటకు రాకుండా రాజమౌళి జాగ్రత్త పడుతున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలను కూడా భాగం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఓ అడ్వెంచర్స్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా ప్రియాంక చోప్రా నటించబోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ నటించబోతున్నారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ విషయంపై కూడా గతంలో ఈయన స్పందిస్తూ ఇంకా ఈ సినిమా గురించి ఎలాంటి క్లారిటీ లేదని ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయ్ అంటూ చెప్పకనే చెప్పేశారు.. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ దర్శకుడిగా నా చేతిలో ఉన్న సినిమా పనులు అన్నింటిని పూర్తి చేశాను.వాటికి సంబంధించిన బిజినెస్ అండ్ మార్కెటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.

ఇక నటుడుగా తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నాను.ఇందుకు సంబంధించి ఒక పరభాషా చిత్రంలో నటించబోతున్నాను. ఈ సినిమాలో చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా ఉండబోతున్నాయి. కొంచం భయంగా కూడా ఉందంటూ పోస్ట్ చేసాడు.పృథ్వీ రాజ్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారడంతో పాటు, ssmb 29 ని ఉద్దెశించే,ఈ పోస్ట్ చేసాడని పలువురు సినీ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి పృథ్వీ రాజ్ ఈ సినిమాలు బాగా కాబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈయన ఇలాంటి పోస్ట్ చేయడంతో కచ్చితంగా మహేష్ రాజమౌళి సినిమా గురించి ఈ పోస్ట్ చేసి ఉంటారని భావిస్తున్నారు.