ఇటీవల టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని మాగా చైతన్య మరియు సమంతా (సామ్) అక్కినేని లు తమ వివాహ బంధం నుంచి విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎలాంటి హడావుడి లేకుండా బాహాటంగానే వారు విడిపోతున్నట్టు ప్రకటన ఇచ్చి ఒక క్లారిటీ ఇచ్చారు.
అయితే ఇక్కడ నుంచి ఎందుకు వీరు విడిపోయారు అనే కోణంలో తప్పు ఎవరిది అనే ప్రశ్నకు కొంతమంది సమంత క్యారెక్టర్ ని పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సామ్ కి వేరే ఎవరికో లింక్ పెట్టి కొన్ని కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా దారుణం అని చెప్పాలి. వాస్తవానికి ఏం జరుగింది అనేది బయట లోకం ఎవరికీ తెలీదు.
వారి ఇంటి పెద్ద నాగార్జున నే వీరు విడిపోతున్నారంటీ ఎంతో బాధ పడ్డారు. అలాంటిది ఈ విషయంపై సమంత పై అలాంటి వార్తలు అసలు నిజమో కాదో తెలియకుండా ప్రచారం చేయడం నిజంగా హేయం.. అయినా అవతల వాళ్ళ పర్సనల్ విషయాలపై ఉన్న శ్రద్ధ మనమీద ఎందుకు ఉండదో అని ఏదో సినిమాలో డైలాగ్ గుర్తు వస్తుంది ఇదంతా చూస్తుంటే..