ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. సుమీ నగరంలో రష్యా చేసిన భారీ బాంబు దాడిలో 18 మంది పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. మృతి చెందినవారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపింది. పలు నగరాల్లో కాల్పుల విరమణ ప్రకటిస్తూనే.. పౌరులపై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది. రష్యా దాడుల నేపథ్యంలో తమ ప్రజలను రక్షించాలని..ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయాలంటూ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా ప్రపంచ దేశాలను కోరారు. తమకు యుద్ధ విమానాలను అందించాలని ప్రాథేయపడ్డారు.