Rowdy Boys Trailer : మాస్ ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్!

Rowdy Boys Trailer :  టాప్ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశీష్ రెడ్డిని టాలీవుడ్ లో హీరోగా ఎంటర్ చేస్తూ ‘రౌడీ బాయ్స్’ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దీని ట్రైలర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ శనివారం సాయంత్రం లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ యూత్ ని ఆకట్టుకునే అన్ని అంశాలతో కమర్షియల్ గా వుంది.

రఫ్ కాలేజీ స్టూడెంట్ గా ఆశీష్ రెడ్డిని పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇంట్లో తండ్రి మంచి మాటల్ని పెడ చెవిని బెట్టి కాలేజీలో గొడవలు పెట్టుకునే ఆశీష్ తనకంటే వయసులో పెద్దదైన మెడికల్ స్టూడెంట్ అనుపమా పరమేశ్వరన్ తో ప్రేమలో పడతాడు.

Rowdy Boys Trailer - Ashish, Anupama | Devi Sri Prasad | Harsha Konuganti | Dil Raju

 

ఇతడి రౌడీ ప్రవర్తన నచ్చక ఆమె దూరమవుతుంది. తన రౌడీ ప్రవర్తన ప్రేమకి అడ్డు పడుతోందని గ్రహించిన అతను ఏం చేసి తిరిగి ఆమె ప్రేమని పొందాడనేది ట్రైలర్ ద్వారా తెలుస్తున్న కథ. స్టూడెంట్ గ్రూపుల పోరాటాలు, మధ్యలో ప్రేమ – కొత్త కథేమీ కాదు. పాత మాస్ కథనే మాస్ డైలాగులతో యూత్ కి గాలం వేసేలా తీశారు.

‘రౌడీ బాయ్స్’ అనేది కాలేజీ వినోదం, సంఘర్షణలు, ఓ ప్రేమకథ, యువకుడి భావోద్వేగ ప్రయాణం మొదలైన అంశాలు కలిపిన ట్రెండీ ప్యాకేజీ అనవచ్చు. సహదేవ్ విక్రమ్, కార్తీక్ రత్నం, తేజ్ కూరపాటి, కోమలి ప్రసాద్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణం. విడుదల జనవరి 14.