‘రొమాంటిక్’ కాన్ఫిడెన్స్ సరే, ఆ సాహసం కత్తి మీద సామే.!

Romantic Super Confidance | Telugu Rajyam

ముందుగా వదిలిన పోస్టర్ల ద్వారా కేవలం యూత్ టార్గెట్‌గా తెరకెక్కిన చిత్రం ‘రొమాంటిక్’ అని భావించారంతా. కానీ, ట్రైలర్ రిలీజ్ అయ్యాకా ఈ మూవీలో రొమాన్సే కాదు, అంతకు మించి విషయమేదో ఉందని చూజాయగా హింట్ ఇచ్చారు. ఇక ఫెయిల్యూర్ మూవీ అయినా, తొలి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులేయించుకున్న ఆకాష్ ఈ సినిమాలో చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు. హిట్ పక్కా అని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే, ఈ నెల 29న ‘రొమాంటిక్’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, విడుదలకు రెండు రోజులు ముందే, ఈ సినిమా ప్రీమియర్ షో వేయనున్నారట. మహేష్‌బాబు సొంత ధియేటర్ అయిన ఏఎంబీ ధియేటర్‌లో ‘రొమాంటిక్’ ప్రీమియర్ ప్రదర్శించనున్నారట. అంటే సినిమా రిజల్ట్ ముందే తెలిసిపోనుందన్న మాట.

సినిమాపై చాలా కాన్ఫిడెన్స్ ఉంది.. అని చెప్పడానికే పూరీ ఈ సాహసం చేస్తున్నాడా.? కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. కానీ, ఇది కొంచెం ఓవర్‌గా లేదూ.? అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లక్కు కలిసొచ్చి, పాజిటివ్ టాక్ వస్తే సరే.. ఏమాత్రం కాస్త అటూ ఇటూ అయినా పాపం బోలెడంత ఫ్యూచర్ ఉన్న ఆకాష్ కెరీర్ ఏమవుతుంది.?

అసలింతకీ ఈ ప్రీమియర్ షోలో నిజమెంతో.?

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles