రొమాంటిక్ ఓవర్ డోస్, కానీ.. కేతిక సూపర్ క్యూట్

Romantic Over Dose But Super Cute | Telugu Rajyam

తెలుగులో తొలి సినిమా విడుదల కాకుండానే పలు సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది బొద్దుగుమ్మ కేతిక శర్మ. ఆ తొలి సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమయ్యింది. ఆ సినిమా పేరు ‘రొమాంటిక్’. పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ హీరోగా నటించిన సినిమా ఇది.

నిజానికి, ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతోపాటుగా ‘రొమాంటిక్’ సినిమాని తెరకెక్కించారు. అయితే, కొన్ని కారణాలతో ‘రొమాంటిక్’ విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. అనిల్ పాడూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి పూరి జగన్నాథ్, ఛార్మి నిర్మాలు.

ఇదిలా వుంటే, ‘రొమాంటిక్’ ప్రమోషన్స్ షురూ అయ్యాయ్. పాటల ప్రోమోలు సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఈ జనరేషన్ యూత్ కోసం.. అన్నట్టుగా రొమాంటిక్ టచ్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. రొమాంటిక్.. ఓవర్ డోస్.. అనేలా వుంది.

కేతిక శర్మ అయితే, ఎంత హాట్‌గా కనిపిస్తున్నా.. అంతకు మించిన క్యూట్ అప్పీల్‌తో కుర్రకారుని కట్టిపడేస్తోంది. నవంబర్ 4న ‘రొమాంటిక్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles