Roja selvamani : వైరల్ – మహేష్ బాబుకి హాట్సాఫ్ అంటున్న రోజా..ఎందుకంటే.?

 Roja selvamani : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం “సర్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మరిన్ని ఆసక్తికర బిగ్ ప్రాజెక్ట్స్ కి సిద్ధం అవుతూ తన క్రేజ్ ని మరింత స్థాయిలో పెంచుకుంటూ వెళ్తున్న మహేష్ బాబు తన నిజ జీవితంలో కూడా హీరో అన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే వెయ్యి మందికి పైగా చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్ లు చేయించి మహేష్ ఆపద్బాంధవుడు అయ్యాడు. అయితే తన ఈ గుండె ఆపరేషన్స్ మహత్తర కార్యాన్ని మరింత స్థాయిలో విస్తరించడానికి పూనుకున్నాడు. ప్రముఖ హాస్పిటల్స్ రైన్ బో హాస్పిటల్స్ తో కలిసి ప్యూర్ లిటిల్ హార్ట్స్ అనే కొత్త ఫౌండేషన్ ని స్టార్ట్ చేసి మరింతమందికి తన సేవలు అందించేలా పూనుకున్నారు.
మరి దీనితో మహేష్ చేసిన ఈ పనికి గాను ఏపీపిపిఎస్సి చైర్మన్ మరియు టాలీవుడ్ ప్రముఖ నటి రోజా ఆర్కే సెల్వమణి కీలక కామెంట్స్ చేశారు. మహేష్ ది నిన్నటి వీడియో షేర్ చేసి ఎంతోమంది చిన్నారుల గుండె చప్పుడు వింటున్న మహేష్ బాబు కి హ్యాట్సాఫ్ చెబుతున్నానని తాను తెలిపింది.
దీనితో ఈ వీడియో మరియు తన పోస్ట్ రెండు మహేష్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతున్నాయి. అలాగే మహేష్ మరియు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ అభిమానులు అయితే మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.