Nani – Roja: ప్రస్తుతం టాలీవుడ్ లో సినీ పెద్దలకు,ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ల ధరల తగ్గింపు విషయంలో చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. తాజాగా సినిమాలు చేయటం కన్నా కిరాణా కొట్టు వ్యాపారమే బెటర్ అంటూ హీరో నాని చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.. టికెట్ ధరల తగ్గింపు , థియేటర్లు మూసివేయడం వంటి వాటిపై హీరో నాని మాట్లాడుతూ టికెట్ ధరలు తగ్గించడం అంటే అభిమానులను అవమానించటం అని ఆయన అన్నారు.
హీరో నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఇప్పటికే చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దీనితో హీరో నాని తన చేసిన వ్యాఖ్యలు ఉద్దేశం వేరని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే విషయంలో ఏపీ మంత్రి అనిల్ మాట్లాడుతూ హీరోల రెమ్యునరేషన్ భారీగా ఉందని అదే సినిమా నిర్మించడానికి 70 శాతం ఖర్చు అని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఇదే విషయం పైన ఫైర్ బ్రాండ్ రోజా స్పందించారు.
రోజా మాట్లాడుతూ సీఎం జగన్ ఎప్పుడు పేదలకు మంచి జరిగేలా నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. టాలీవుడ్ లో హీరోలు పెద్ద సినిమాల గురించి ఆలోచిస్తున్నారు చిన్న సినిమాల గురించి ఆలోచించడం లేదని ఆమె పేర్కొన్నారు. టికెట్ ధరల తగ్గింపు విషయం తొందరలోనే పరిష్కారమవుతుందని దీని కోసం నియమించిన కమిటీ అన్ని అంశాలను అధ్యయనం చేసి పరిష్కారం సూచిస్తుంది అన్నారు.
ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే ప్రమాదం ఉందని ఆవిడ వ్యాఖ్యానించారు. నాని చేసిన వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ సినిమా చేయడం కన్నా కిరాణా కొట్టు వ్యాపారం బాగుంది అనుకున్నప్పుడు నాని సినిమాలు చేయడం వేస్ట్ కిరాణా కొట్టు వ్యాపారమే పెట్టుకోవచ్చు కదా అని ఆవిడ వ్యాఖ్యానించారు. రాజకీయ పార్టీలు పెట్టి సినిమా తీస్తున్న వారివల్లే ఈ వివాదాలు తలెత్తుతున్నాయని ఆవిడ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఎప్పుడు చర్చలకు సిద్ధమే అని సామరస్యంగా మాట్లాడకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని రోజా సూచించారు.