Rakesh – Sujatha: ప్రేమ అన్నది ఎప్పుడు, ఎక్కడ, ఎలా అయినా పుట్టవచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఎలా పుడుతుంది అన్నది కూడా చెప్పడం చాలా కష్టం. అలా సిరి ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ప్రేమ అన్నది సాధారణమైన విషయం. ఇకపోతే తెలుగు బుల్లితెరపై కూడా ఇప్పటికే ఎన్నో జోడీలు షో కోసం లవ్ ట్రాక్ నడుపుతూ ఉంటారు. ఇంకొన్ని జోడీలు నిజంగానే లవ్ లో పడుతూ ఉంటారు. అలాంటి జోడి లలో జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్, బిగ్ బాస్ సీజన్ సుజాత జోడి కూడా ఒకటి. గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య ప్రేమ ఉంది అంటూ వార్తలు పెద్దఎత్తున వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఒక షోలో పాల్గొన్న ఈ జంట వారిది రియల్ జోడినే అంటూ ప్రకటించారు. రాకేష్ సుజాతకు రింగ్ పెట్టి మరీ ప్రపోజ్ చేయగా సుజాత సిగ్గుతో నవ్వేసింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు అంటూ హింట్ కూడా ఇచ్చేశారు. వీరిద్దరి మధ్య జబర్దస్త్ లో పలు స్కిట్ ల ద్వారా మొదలైందని వీరిద్దరి ప్రేమకు ఇరు వర్గాల కుటుంబ సభ్యులు ఇప్పటికే అంగీకరించినట్టు తెలుస్తోంది.