రితూ వర్మ ‘రేంజ్’ పెంచిన ‘వరుడు కావలెను’.!

‘టక్ జగదీష్’ సినిమా సక్సెస్ అయి వుంటే, రితూ వర్మ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయేది. థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ అయ్యిందా సినిమా. అయితేనేం, ‘వరుడు కావలెను’ సినిమాతో రితూ వర్మ రేంజ్ పెరిగింది. సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించింది.? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఈ సినిమాలో ‘భూమి’ పాత్రతో ఆమె నటిగా చాలా మంచి మార్కులు కొట్టేసింది.

ప్రస్తుతం రీతూ వర్మకి టాలీవుడ్‌లో డిమాండ్ అమాంతం పెరిగిపోయిందట. ‘వరుడు కావలెను’ సక్సెస్‌ని మేగ్జిమమ్ ఎంజాయ్ చేస్తోంది ఈ తెలుగు బ్యూటీ. తన నటనకు దక్కుతున్న ప్రశంసలతో తన మీద బాధ్యత మరింత పెరిగినట్లు భావిస్తున్నానని రీతూ వర్మ అంటోంది.

సోషల్ మీడియా వేదికగా అభిమానులు తన నటనను ప్రశంసిస్తూ వేస్తోన్న ట్వీట్స్‌పై రీతూ వర్మ స్పందిస్తూ వస్తోంది. అలా తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ని అమాంతం పెంచేసుకుంటోంది రీతూ వర్మ.

గ్లామర్ విషయంలో తనకేమీ అభ్యంతరాలు లేవంటూనే, నటనకు ప్రాధాన్యమున్న గ్లామరస్ పాత్రల్ని ఎంచుకుంటానని రీతూ వర్మ చెబుతోంది. నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన ‘వరుడు కావలెను’ ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.