‘వరుడు’ దొరికేశాడా: పెళ్లి విషయం బయటపెట్టిన రీతూ వర్మ.?

‘పెళ్లి చూపులు’ సినిమాతో పాపులర్ అయిన రీతూ వర్మఇప్పుడిప్పుడే వరుస ఆఫర్లు అందుకుంటూ, కెరీర్‌‌ని జాగ్రత్తగా బిల్డప్ చేసుకుంటోంది. మొన్నీ మధ్య నానితో ‘టక్ జగదీష్’లో నటించింది. ఆ సినిమా రీతూ వర్మను భారీగా నిరాశపరిచింది. ఇక, ఇప్పుడు ‘వరుడు కావలెను’ సినిమాతో నాగశౌర్యకు జంటగా నటిస్తోంది.

ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, రీతూ వర్మ పెళ్లి వార్త బయటకొచ్చింది. అయితే, అందుకు ఇంకా రెండేళ్లు టైముందనీ, ఇంకా చేయాల్సిన డ్రీమ్ ప్రాజెక్టులు చాలా ఉన్నాయనీ మాట దాటేసింది రీతూ వర్మ.

అంతా బాగానే ఉంది కానీ, ఈ పెళ్లి కూతురుకు సరిజోడీ అయిన వరుడు ఆల్రెడీ రెడీనా.? అంటే నో వే.. అని సింపుల్‌గా స్మైల్ ఇచ్చేసింది అందాల రీతూ వర్మ. ఇక రీతూ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, తెలుగుతో పాటు, తమిళంలో ఓ సినిమాలోనూ, ఓ వెబ్ సిరీస్‌లోనూ నటిస్తోంది. ఇంకొన్ని ప్రాజెక్టులు ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయట. అదీ సంగతి.