వర్మ అంటేనే సంచలనం. సంచలనం అంటేనే వర్మ. సంచలనాల కోసం ఏ సందర్భాన్నీ, ఏ సమయాన్నీవదులుకోడు రామ్ గోపాల్ వర్మ. అదేంటో అదో తుత్తి ఆయనకు. ఇకపోతే, తాజాగా వర్మగారు తన సొంత ప్రొడక్షన్ కంపెనీ నుండి మరో ఆణిముత్యాన్ని బయటికి తీసుకురానున్నారు త్వరలోనే.
ఏంటా ఆణిముత్యం అనుకుంటున్నరా.? ‘డేంజరస్’ అనే ఓ సినిమా. నిజంగానే సొసైటీకి డేంటజర్‌లెండి. ఇంతకీ ఈ ‘డేంజరస్’ కథా కమామిషూ ఏంటంటారా.? వర్మ సినిమాల్లో ఏముంటుందో అదే. అడల్డ్ కంటెంట్. ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్. అదేనండీ లెస్బియన్ స్టోరీ అన్నమాట. వర్మ ఆస్థాన హీరోయిన్లు అప్సరా రాణి, నైనా గంగోలీలు లీడ్ రోల్ పోషిస్తున్నారు.
ఈ సినిమాని ప్రమోట్ చేసే పెద్ద పనిలో బిజీగా ఉన్నాడు వర్మగారు ప్రస్తుతం. అందులో భాగంగానే ఈ స్టోరీని ఎందుకు ఎంచుకున్నారని మీడియా ప్రబుద్ధులు అడిగిన ప్రశ్నలకు వర్మగారు చెప్పిన చిలిపి పైత్యపు సమాధానం.. ‘నాకు అమ్మాయిలంటే ఇష్టం, ఒక అమ్మాయి ఉంటే, బ్యూటీ.. అదే ఇద్దరమ్మాయిలుంటే డబుల్ బ్యూటీ..’ అందుకే ఇద్దరు లెస్బియన్ అమ్మాయిల మీద సినిమా తీశాను. నాకు లెస్బియన్ అమ్మాయిల ఫీలింగ్స్ అంటే ఇష్టం. అదే ఇద్దరు అబ్బాయిలు (గే) మధ్య లవ్ ఫీలింగ్స్ నాకు అస్సలు నచ్చదు.. అని తనదైన శైలిలో సమాధానమిచ్చి, మరోసారి కాంట్రవర్సీకెక్కారు వర్మగారు. అదీ వర్మ పైత్యం.
మరోవైపు వర్మ,తెలంగాణా రక్తచరిత్రను ప్రతిబింబించేలా కొండా సురేఖ జీవిత గాధ ఆధారంగా ‘కొండా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.