Ram Gopal Varma: కాబోయే ప్రధాని చెప్పేది వినండి: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma: టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిత్యం ఏదో ఒక వివాదంతో తరచుగా వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు రాంగోపాల్. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ ళ్యాణ్ పై కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ ఉంటాడు. ఈ గ్రామంలోనే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫై పలు ట్వీట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ.

 


ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి ఏ పాల్ మాట్లాడిన వీడియో ని రాంగోపాల్ వర్మ షేర్ చేస్తూ..హేయ్ పవన్ సార్.. కాబోయే ప్రధానమంత్రి చెబుతున్నాడు విను అంటూ కామెంట్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ షేర్ చేసిన ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ చెబుతున్నా.. పవన్ సీఎం కావాలన్న మినిస్టర్ కావాలి అన్నా.. ఆయనను ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుందాం. మీరు అంతా ఓకే అంటే నేను ప్రధాని గా ఉంటాను. పవన్ కళ్యాణ్ కావాలి అంటే ముఖ్యమంత్రిని చేద్దాం అని ఆయన ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.