రేవంత్ రెడ్డి తెలంగాణాలో ఒక ఫైర్ బ్రాండ్ లీడర్. తెరాస ప్రభుత్వం మీద ఒంటికాలి మీద లేచే ఒకే ఒక నాయకుడు అని కూడా చెప్పవొచ్చు. తాను ఓటుకు నోటు కేసులో ఇరుక్కునప్పటినుండి తన దూకుడు ఇంకా పెంచారు. అసెంబ్లీ లో రేవంత్ రెడ్డి తనకు ఎదురుపడకూడదు అనే సింగల్ పాయింట్ అజెండాతో తెరాస నాయకులంతా పని చేసి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ని ఓడగొట్టారు. అయితే ఇదేమి రేవంత్ రెడ్డి ని క్రుంగదీయలేదు సరి కదా వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన మల్కాజిగిరి నుండి పోటీ చేసి విజయం సాధించారు.
ఈ రోజు రేవంత్ రెడ్డి నియోగకవర్గ పరిధిలో పర్యటిస్తుండగా ఒక అనూహ్య ఘటన ఎదురైంది. ఒక ఓటరు రేవంత్ రెడ్డి ని ప్రశ్నిస్తూ ” రేవంత్ రెడ్డి గారు మీతో ఒక విషయం చెప్పాలి, ఎంపీ గా మీరు గెలిచారు, ఎమ్మెల్యేగా తెరాస వాళ్ళు గెలిచారు. మా దౌర్భాగ్యం ఏంటంటే మీరు గెలిచిన తరవాత మాకు హరాస్మెంట్ ఇంకా ఎక్కువ అయిందండి మల్కాజిగిరిలో. మీరు గెలిచారు, స్టేట్ పవర్ వాళ్ళ చేతుల్లో వుంది , మీరు వెళ్లి ఒకసారి చూడండి రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో. ఎంతమందికి ఈ రోడ్ డస్ట్ వల్ల కంటి ఆపరేషన్లు అవుతున్నాయో తెలుసా మీకు” అని అతను చెబుతుండగానే రేవంత్ రెడ్డి అక్కడనుండి వెనుదిరిగిపోయారు.
ప్రశ్నించిన వ్యక్తి తాను మాట్లాడిందంతా రికార్డు చేసి ట్విట్టర్ లో పెట్టగా, దీనిని చుసిన వారు మాత్రం, రేవంత్ రెడ్డి కనీసం అతను చెప్పేది పూర్తిగా వినుండాల్సింది, విని పరిశీలిస్తాము అని హామీ ఇచ్చివుంటే బాగుండేదని కామెంట్ చేస్తున్నారు.
Least Congress MP @revanth_anumula could have done is to let the man finish and assure him that grievances will be addressed. pic.twitter.com/q37EoEXeRw
— @CoreenaSuares (@CoreenaSuares2) September 27, 2020