మోదీ హైదరాబాద్ వస్తుంటే నన్ను పిలవరా? ఫైర్ అయిన రేవంత్ రెడ్డి?

revanth reddy tweet on pm modi hyderabad visit

ప్రధాని మోదీ ఇవాళ అంటే శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ కు వస్తున్న విషయం తెలిసిందే కదా. నిజానికి ఆయన సాయంత్రం హైదరాబాద్ కు రావాల్సి ఉంది. మధ్యాహ్నం పూణె వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ కు వస్తారని పీఎంవో నుంచి సమాచారం వచ్చింది. కానీ.. సడెన్ గా మోదీ షెడ్యూల్ ను మార్చారు. పూణె పర్యటనను రద్దు చేసి.. డైరెక్ట్ గా మోదీ హైదరాబాద్ కు వస్తున్నారు.

revanth reddy tweet on pm modi hyderabad visit
revanth reddy tweet on pm modi hyderabad visit

మధ్యాహ్నం డైరెక్ట్ గా హకీంపేటలోని ఎయిర్ పోర్ట్ లో మోదీ దిగుతారు. అక్కడి నుంచి శామీర్ పేటలో ఉన్న భారత్ బయోటెక్ కంపెనీకి వెళ్తారు. అక్కడ కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పురోగతిని పరిశీలించి.. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు. ఇదే.. మోదీ హైదరాబాద్ షెడ్యూల్.

అయితే.. ప్రధాని మోదీ దిగనున్న హకీంపేట ఎయిర్ పోర్ట్, ఆయన పర్యటించనున్న భారత్ బయోటెక్ కంపెనీ.. రెండూ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం కిందికే వస్తాయి.

ఏదైనా నియోజకవర్గానికి పెద్ద పెద్ద స్థాయి నాయకులు కానీ.. ప్రజా ప్రతినిధులు కానీ.. వెళ్లినప్పుడు ఆ నియోజకవర్గానికి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలను పిలవడం ఆనవాయితీ.

ప్రధాని మోదీ నా నియోజకవర్గానికి వస్తూ నన్ను పిలవలేదు. ఆయన పర్యటించే ప్రాంతం అంతా నా నియోజకవర్గం పరిధిలోనే ఉంటుంది. కానీ.. నాకు మాత్రం ఎటువంటి ఆహ్వానం అందలేదు. ఇది చాలా అనాలోచితమైన చర్య.. అంటూ మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్ చేయడమే కాదు.. దేశంలో ఉన్న అన్ని ప్రధాన మీడియాలను టాగ్ చేశారు. రాహుల్ గాంధీకి ఈ ట్వీట్ ను టాగ్ చేశారు. కాంగ్రెస పార్టీకి, పీఎంవోకు కూడా టాగ్ చేస్తూ తన బాధను ట్వీట్ రూపంలో పంచుకున్నారు రేవంత్ రెడ్డి.