నాగర్ కర్నూలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ ను పర్యటించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మల్కజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కారులోనే చాలా సేపు ఉన్నారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. రేవంత్ రెడ్డిని కల్వకుర్తి సందర్శనకు అనుమతించాలని నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నాయకులు రోడ్డును బ్లాక్ చేసి ధర్నా చేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని కాంగ్రెస్ నాయకులను చెదరగొట్టారు. దీంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రేవంత్ రెడ్డి కాలుకు స్వల్ప గాయం అయింది. వెంటనే పోలీసులు.. రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వెంటనే మీడియాతో మాట్లాడిన రేవంత్… ఓవైపు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోకుండా.. తెలంగాణ ప్రభుత్వం… కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సమీపంలో సొరంగ మార్గం పనులు చేపడుతున్నారని… కేవలం కమిషన్ కోసమే సొరంగ మార్గాన్ని నిర్మిస్తున్నారని.. అది ఓపెన్ కెనాల్ అని.. ఆ డిజైన్ ను మార్చి సొరంగమార్గం కింద కమిషన్ కోసమే మార్చారని రేవంత్ ఆరోపించారు.