Shyam Singha Roy OTT : నాని “శ్యామ్ సింగ రాయ్” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడు నుంచంటే!

Shyam Singha Roy OTT : ఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచిన సినిమాల్లో ముఖ్యంగా డిసెంబర్ నెలలో ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. మరి ఈ నెల చివర వారంలో వచ్చిన బ్లాస్టింగ్ మాత్రం నాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి మరియు యంగ్ హీరోయిన్ కృతి శెట్టిలు నటించిన చిత్రం “శ్యామ్ సింగ రాయ్” అని చెప్పాలి.

అదిరిపోయే కథతో ‘టాక్సీ వాలా’ ఫేమ్ దర్శకుడు రాహుల్ ఈ సినిమాతో తన ఖాతాలో రెండో హిట్ ని వేసుకున్నాడు. మరి అలాగే ఈ సినిమాతోనే నాని దాదాపు రెండేళ్ల తర్వాత థియేట్రికల్ గా సాలిడ్ హిట్ అందుకొని మళ్ళీ మంచి కం బ్యాక్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా రిలీజ్ టైం లో పలు కాంట్రవర్సీ లు ఇబ్బంది పెట్టినా వాటిని దాటి అన్ని చోట్లా నాని మంచి విజయాన్ని నమోదు చేసాడు.

ఇక ఇప్పుడు ఎలాగో సినిమా థియేటర్స్ లో బాగానే నడిచింది. మళ్ళీ కరోనా పెరుగుతుంది. దీనితో ఓటిటి లో ఈ సినిమా రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్ధం అయ్యింది. ప్రపంచ ప్రఖ్యాత ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రాన్ని కొనుగోలు చేయగా ఇప్పుడు స్ట్రీమింగ్ కి డేట్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమాని వచ్చే జనవరి 21 నుంచి తెలుగు, తమిళ్ భాషల్లోస్ట్రీమింగ్ కి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఇపుడు మిస్ అయ్యినవాళ్లు అప్పుడు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు..