పెద్దలంటే గౌరవం, వినయం ఉన్న హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ స్టార్ హీరోగా ఎదగటానికి తారక్ పడిన కష్టం అంతాఇంతా కాదు. నిర్మాతలు తన సినిమాల వల్ల నష్టపోతే ఆదుకునే హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందువరసలో ఉంటారు. అయితే ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రెడ్డిని జూనియర్ ఎన్టీఆర్ అవమానించారని ఒక వార్త జోరుగా ప్రచారంలో ఉంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎం.ఎస్.రెడ్డి నిర్మాతగా గుణశేఖర్ డైరెక్షన్ లో బాల రామాయణం అనే సినిమా తెరకెక్కింది. ఎం.ఎస్. రెడ్డి తన ఆటోబయోగ్రఫీలో జూనియర్ ఎన్టీఆర్ తనను అవమానించాడని రాసుకున్నారు. జబర్దస్త్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి తండ్రి ఎం.ఎస్.రెడ్డి కావడం గమనార్హం. అయితే ప్రముఖ జర్నలిస్ట్ భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో ఎం.ఎస్ రెడ్డి వచ్చేవరకు ఎదురుచూడకుండా వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు.
అయితే ఆ సమయంలో తనను పట్టించుకోకుండా వెళ్లిపోయాడని ఎం.ఎస్.రెడ్డికి జూనియర్ ఎన్టీఆర్ పై కోపమని అందుకే జూనియర్ ఎన్టీఆర్ అవమానించాడని రాశారని భరద్వాజ్ తెలిపారు. ఎన్టీఆర్ కు 14 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎం.ఎస్ రెడ్డి అందరిపై విమర్శలు చేశారని ఎం.ఎస్.రెడ్డి విమర్శలు చేసిన వారిలో చిరంజీవి కూడా ఉన్నారని భరద్వాజ్ వెల్లడించారు. చిరంజీవి తనను ఇబ్బంది పెట్టాడని ఎం.ఎస్.రెడ్డి రాశారని ఆయన తెలిపారు.
చిరంజీవి షూటింగ్ కు ఆలస్యంగా వచ్చేవారని తనకు కేటాయించిన డేట్లను ఇతరులకు ఇచ్చేవారని ఎం.ఎస్.రెడ్డి రాశారని భరద్వాజ్ కామెంట్లు చేశారు. వాళ్లకు వాళ్లు చేసుకున్న తప్పుల వల్లే అంజి సినిమా ఫ్లాప్ అయిందని ఎం.ఎస్.రెడ్డి తన లైఫ్ ను అంజి సినిమా అతలాకుతలం చేసిందని రాశారని భరద్వాజ్ కామెంట్లు చేశారు. ఎం.ఎస్.రెడ్డి రాసిన ఈ పుస్తకం ఆఫ్ లైన్ లో అందుబాటులో లేకపోయినా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.