భారీ బిజినెస్ ని జరుపుకున్న కమల్ హాసన్ “విక్రమ్”..ఎన్ని కోట్లు అంటే.!

ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ సినిమాల్లో తమిళ దిగ్గజ హీరో కమల్ హాసన్ హీరోగా ఫహాద్ ఫాజిల్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే స్టార్ హీరో సూర్య లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ కలయికలో తెరకెక్కించిన భారీ ఏక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “విక్రమ్” కూడా ఒకటి. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాని మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించాడు.

అయితే ఇప్పుడు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమా యూనిట్ ఆ పనుల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు తమిళ మీడియా వర్గాల నుంచి ఈ సినిమా బిజినెస్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమాకి గాను అన్ని భాషల్లో థియేట్రికల్ అలాగే ఓటీటీ హక్కులు కలిపి ఏకంగా 200 కోట్లకి పైగా జరిగిందట. ఇది కమల్ హాసన్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ అట.

మరి థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ఈ సినిమా సెన్సేషన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి సంగీతం అనిరుద్ అందించగా కమల్ హాసన్ తన నిర్మాణ బ్యానర్ పై అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జూన్ 3న విడుదల కాబోతోంది.